భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పాకిస్థాన్.. ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాతనైనా అది సాధ్యమవుతుందన్న ఆశాభావంతో ఉంది.
కరాచీ: భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పాకిస్థాన్.. ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాతనైనా అది సాధ్యమవుతుందన్న ఆశాభావంతో ఉంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ నజాం సేథి ఈ మేరకు తటస్థ వేదికపైనైనా సిరీస్ జరుగుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలన్న బీసీసీఐ నిర్ణయం తమకు శుభ సంకేతమన్నారు. పాక్‌లో పర్యటించేందుకు భారత్‌కు అభ్యంతరముంటే యూఏఈ వంటి తటస్థ వేదికపైనైనా ఆడేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. 2009లో శ్రీలంక క్రికెట్ జట్టుపై ఉగ్రవాదులు దాడి చేసినప్పటినుంచి టెస్టు దేశాలేవీ పాకిస్థాన్‌లో అడుగు పెట్టని సంగతి తెలిసిందే.