ఉత్తమ భారత క్రికెటర్‌గా రహానే | Ajinkya Rahane conferred CEAT Indian Cricketer of the Year award | Sakshi
Sakshi News home page

ఉత్తమ భారత క్రికెటర్‌గా రహానే

Published Tue, May 26 2015 3:24 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM

ఉత్తమ భారత క్రికెటర్‌గా రహానే

ఉత్తమ భారత క్రికెటర్‌గా రహానే

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో నిలకడైన ఆటతీరు కనబర్చిన అజింక్య రహానే ‘సియట్’ వార్షిక అవార్డుల్లో ఉత్తమ భారత క్రికెటర్‌గా ఎంపికయ్యాడు.

 ‘సియట్’ అవార్డుల ప్రదానం
 ముంబై: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో నిలకడైన ఆటతీరు కనబర్చిన అజింక్య రహానే ‘సియట్’ వార్షిక అవార్డుల్లో ఉత్తమ భారత క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. 2014-15 సంవత్సరానికి సంబంధించిన అవార్డుల కార్యక్రమం సోమవారం ఇక్కడ జరిగింది. కుమార సంగక్కర (శ్రీలంక) ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. భారత దిగ్గజం కపిల్‌దేవ్‌ను లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. ఉత్తమ బ్యాట్స్‌మన్, బౌలర్లుగా హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా), హెరాత్ (శ్రీలంక),  ఉత్తమ టి20 ఆటగాడిగా డ్వేన్ బ్రేవో  (వెస్టిండీస్) పురస్కారాలు స్వీకరించారు. పొలార్డ్ (వెస్టిండీస్)కు పాపులర్ చాయిస్, వన్డే డబుల్ సెంచరీకి రోహిత్ శర్మకు ప్రత్యేక అవార్డు, ఉత్తమ దేశవాళీ ఆటగాడు అవార్డు వినయ్‌కుమార్‌కు, యువ ఆటగాడి అవార్డు దీపక్ హుడాకు లభించాయి. జ్యూరీ చైర్మన్ గవాస్కర్‌తో పాటు సియట్ అంబాసిడర్ బ్రెట్‌లీ (ఆస్ట్రేలియా) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement