పీకేఎంసీసీ 234 ఆలౌట్
హైదరాబాద్ టైటాన్స్‌తో మ్యాచ్
సాక్షి, హైదరాబాద్: ఎ–2 డివిజన్ రెండు రోజుల లీగ్‌లో హైదరాబాద్ టైటాన్స్ బౌలర్ అఖిల్ శ్రీనివాస్ అద్వితీయ ప్రదర్శన చేశాడు. పీకేఎంసీసీ జట్టుతో ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో 8వికెట్లతో చెలరేగాడు. మొదట పీకేఎంసీసీ జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 60.1 ఓవర్లలో 234 పరుగులకే కట్టడి చేశాడు. బ్యాటింగ్‌లో రోహ న్ (109; 21 ఫోర్లు) సెంచరీ చేయగా, వికాస్ (62) అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం హైదరాబాద్ టైటాన్స్ తొలిరోజు ఆట ముగిసేసరికి 27 ఓవర్లలో 6 వికెట్లకు 73 పరుగులు చేసింది. తేజ 4 వికెట్లు దక్కించుకున్నాడు.
ఇతర లీగ్ మ్యాచ్‌ల వివరాలు
గౌడ్స్ ఎలెవన్: 139 (తపస్ మిశ్రా 44; దివేవ్ సింగ్ 5/52), బడ్డింగ్ స్టార్: 140/3 (అమీర్ మలిక్ 82). జిందా తిలిస్మాత్: 362 (రాజ్ మిశ్రా 78, అజహర్ అలీ 105, అజహరుద్దీన్ 75; రిషబ్ (5/117), కొసరాజు సీసీ: 44/2. బాలాజీ సీసీ: 235 (సూరజ్ 50, శశాంక్ 60; అఫ్సర్ 4/57), సీసీఓబీ: 60/3 Üఅవర్స్: 281 (ప్రశాంత్ 67, సత్య ప్రణవ్ 62; శివంగ్ యాదవ్ 5/48), శ్రీ శ్యామ్: 31/1 (9 ఓవర్లలో). రాజు సీసీ: 181 (నిర్భయ్ సాయిరెడ్డి 73; నీలేశ్ 5/73, అశ్విన్ 4/33), నేషనల్ సీసీ: 184/3 (అశ్విన్ 52, మొహమ్మద్ అసదుద్దీన్ 97). ఫ్యూచర్ స్టార్: 157 (రమావత్ రాజేశ్ 5/40), తెలంగాణ: 147/2 (హర్షవర్ధన్ 91, నితిన్ 35 బ్యాటింగ్). ఉస్మానియా: 336 (సిద్ధాంత్ 65, జగదీశ్ 67, దీపాంకర్ 52), ఎంసీసీ: 48/0 (9 ఓవర్లలో).
అఖిల్ విజృంభణ
Published Tue, Aug 1 2017 10:43 AM | Last Updated on Mon, Sep 11 2017 11:01 PM
Advertisement
Advertisement