‘ఖేల్‌రత్న’లకు ఆమోదముద్ర | Approved to 'Khel Ratna' | Sakshi
Sakshi News home page

‘ఖేల్‌రత్న’లకు ఆమోదముద్ర

Aug 23 2017 12:47 AM | Updated on Sep 12 2017 12:46 AM

భారత హాకీ ఆటగాడు సర్దార్‌ సింగ్, పారాలింపియన్‌ దేవేంద్ర జజరియా ప్రతిష్టాత్మక ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ అవార్డు ఎంపిక

న్యూఢిల్లీ: భారత హాకీ ఆటగాడు సర్దార్‌ సింగ్, పారాలింపియన్‌ దేవేంద్ర జజరియా ప్రతిష్టాత్మక ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ అవార్డు ఎంపిక అధికారికంగా ఖరారైంది. సెలక్షన్‌ కమిటీ కొద్ది రోజుల క్రితమే వీరిద్దరి పేర్లను ప్రతిపాదించగా... కేంద్ర క్రీడా శాఖ మంగళవారం వీటికి ఆమోద ముద్ర వేసింది. వీటితో పాటు ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్‌ పురస్కారాల కోసం ప్రతిపాదించిన జాబితాను కూడా కేంద్రం ఆమోదించింది. హైదరాబాద్‌కు చెందిన హకీమ్‌ (ఫుట్‌బాల్‌) ధ్యాన్‌చంద్‌ అవార్డును, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గంగుల ప్రసాద్‌ (బ్యాడ్మింటన్‌) ద్రోణాచార్య (లైఫ్‌టైమ్‌) అవార్డును అందుకోనున్నారు.  

‘అర్జున’ విజేతలకు జగన్‌ అభినందనలు  
సాక్షి, అమరావతి: జాతీయ క్రీడా పురస్కారాల్లో భాగంగా ‘అర్జున’ అవార్డులకు ఎంపికైన తెలుగు క్రీడాకారులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. కమిటీ ప్రతిపాదించిన 17 మంది ఆటగాళ్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన జ్యోతి సురేఖ (ఆర్చరీ), సాకేత్‌ మైనేని (టెన్నిస్‌)లకు ‘అర్జున’ అవార్డులు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement