విశాఖ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో సత్తాచాటిన టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో వేగవంతంగా 350 వికెట్లను సాధించిన జాబితాలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి సంయుక్తంగా టాప్‌లో నిలిచాడు. మురళీ ధరన్ 66వ టెస్టులో ఆ మార్కును చేరగా, ఇప్పుడు అశ్విన్ సైతం అన్నే టెస్టుల్లో 350 వికెట్ల ఫీట్‌ను సాధించాడు.
కాగా, ఈ ఘనతను వేగవంతంగా సాధించిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఇక్కడ అనిల్ కుంబ్లే 77వ టెస్టులో ఈ మార్కును చేరగా, హర్భజన్ సింగ్ 83వ టెస్టులో 350 వికెట్లు సాధించాడు. ఈ టెస్టుకు ముందు అశ్విన్ టాప్‌లో నిలవడానికి ఎనిమిది వికెట్ల దూరంలో ఉండగా దాన్ని సునాయాసంగానే అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో తన స్పిన్ మ్యాజిక్‌ను చూపించిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో బ్రయన్ వికెట్‌ను తీయడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment