ఆసీస్, కివీస్ రెండో టెస్టు డ్రా | Aussies, Kiwis draw in the second Test | Sakshi
Sakshi News home page

ఆసీస్, కివీస్ రెండో టెస్టు డ్రా

Published Wed, Nov 18 2015 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM

Aussies, Kiwis draw in the second Test

పెర్త్: ఇరు జట్లు బ్యాటింగ్‌లో దుమ్మురేపడంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య మంగళవారం ముగిసిన రెండో టెస్టు ‘డ్రా’గా ముగిసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో స్మిత్ సేన 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగియడంతో ట్రాన్స్-టాస్మాన్ ట్రోఫీని ఆసీస్ నిలబెట్టుకుంది. 321 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు  బరిలోకి దిగిన కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లలో 2 వికెట్లకు 104 పరుగులు చేసింది. ఈ టెస్టుతో కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన జాన్సన్‌కు ఈ రెండు వికెట్లు దక్కా యి.

అంతకుముందు 258/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 7 వికెట్లకు 385 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రాస్ టేలర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు (డే నైట్) ఈనెల 27 నుంచి అడిలైడ్‌లో జరుగుతుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement