పోరాడుతున్న ఆసీస్
పెర్త్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పోరాడుతోంది. నాల్గో రోజు ఆటలో దక్షిణాఫ్రికా విసిరిన 539 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.ఆసీస్ ఆటగాళ్లు షాన్ మార్ష్(15),డేవిడ్ వార్నర్(35),స్టీవ్ స్మిత్(34), వోగ్స్(1)లు పెవిలియన్ చేరారు.
దక్షిణాఫ్రికా పేసర్ రబడా విజృంభించి మూడు వికెట్లు తీశాడు. ఉస్మాన్ ఖవాజా(58 బ్యాటింగ్), మిచెల్ మార్ష్(15 బ్యాటింగ్)క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే సోమవారం చివరి రోజంతా ఆడాల్సి వుంది. అదే సమయంలో ఆసీస్ విజయానికి మరో 370 పరుగులు కావాల్సి ఉండగా, సఫారీల విజయానికి ఆరు వికెట్లు అవసరం.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 242 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 540/8 డిక్లేర్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 244 ఆలౌట్