దక్షిణాఫ్రికా ఘన విజయం
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు
పెర్త్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో తొలిరోజే కుప్పకూలిన దక్షిణాఫ్రికా జట్టు అత్యద్భుతంగా పుంజుకుని 177 పరుగులతో ఘన విజయం సాధించింది. 539 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్‌సలో 119.1 ఓవర్లలో 361 పరుగులకు ఆలౌటైంది. దీంతో డుప్లెసిస్ సేన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఆఖరి రోజు సోమవారం 169/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఆసీస్.... ఉస్మాన్ ఖ్వాజా (182 బంతుల్లో 97; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), నెవిల్ (153 బంతుల్లో 60 నాటౌట్; 6 ఫోర్లు) పోరాడటంతో డ్రాపై ఆశలు పెట్టుకుంది. కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రబడా (5/92) చెలరేగిపోవడంతో ఆసీస్‌కు పరాజయం తప్పలేదు. ఈ నెల 12 నుంచి హోబర్ట్‌లో రెండో టెస్టు జరుగుతుంది.
ఈ టెస్టు తొలి రోజే ఆస్ట్రేలియా బౌలర్లు కంగారెత్తించి ప్రొటీస్‌ను తొలి ఇన్నింగ్‌సలో 242 పరుగులకే కట్టడి చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగి డేవిడ్ వార్నర్ విజృంభణతో వికెట్ నష్టపోకుండా 158 పరుగులతో పటిష్టంగా నిలిచింది. ఈ దశలో అంతా తొలి రోజే మ్యాచ్ ఆసీస్ చేతికి వచ్చిందనుకున్నా... అనూహ్యంగా 244 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్‌సలో ప్రొటీస్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడి 540 పరుగులు చేశారు. దీంతో ఆసీస్‌కు 539 పరుగుల భారీ లక్ష్యం ఎదురరుుంది.