ఓటమి అంచున ఆసీస్! | Rabada's fifth leaves SA three away | Sakshi
Sakshi News home page

ఓటమి అంచున ఆసీస్!

Published Mon, Nov 7 2016 10:46 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

ఓటమి అంచున ఆసీస్!

ఓటమి అంచున ఆసీస్!

పెర్త్:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి అంచున నిలిచింది. దక్షిణాఫ్రికా విసిరిన 539 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా 262 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఎదురుదుతోంది.169/4 ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆస్ట్రేలియా స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓవర్ నైట్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా(97)తృటిలో సెంచరీ కోల్పోగా, మరో ఆటగాడు మిచెల్ మార్ష్(26) నిరాశపరిచాడు.

అనంతరం మిచెల్ స్ట్రార్క్(13) అవుట్ కావడంతో ఆస్ట్రేలియా లంచ్ సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. ఇక ఆస్ట్రేలియా విజయం సాధించడానికి 276 పరుగులు అవసరం కాగా,  దక్షిణాఫ్రికా విజయానికి మూడు వికెట్లు అవసరం.నేవిల్(21 బ్యాటింగ్), సిడెల్(0బ్యాటింగ్)లు  క్రీజ్ లో  ఉన్నారు. ప్రస్తుతం కోల్పోయిన ఆస్ట్రేలియా వికెట్లలో దక్షిణాఫ్రికా పేసర్ రబడా ఐదు వికెట్లు సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement