భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో కనీసం 300 నుంచి 320 పరుగుల మధ్య ఆస్ట్రేలియాను ఇండియా కట్టడి చేయగలదని క్రికెట్ అభిమానులు తెలిపారు.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో కనీసం 300 నుంచి 320 పరుగుల మధ్య ఆస్ట్రేలియాను ఇండియా కట్టడి చేయగలదని క్రికెట్ అభిమానులు తెలిపారు. 40 ఓవర్లలో 4 వికెట్లు పోయిన సందర్భంలో 239 పరుగులు చేసిన ఆసీస్ను భారత బౌలర్లు ఎంత స్కోరుకు కట్టడి చేయగలరని సాక్షి ఫేస్ బుక్ ద్వారా ప్రశ్నించగా.. ఈ విధంగా స్పందించారు. మరికొందరు 300లోపే కట్టడి చేస్తారని తెలిపారు. ఇంకొందరు మాత్రం 350 పరుగుల వరకు కట్టడి చేయలేరేమో అని కూడా అన్నారు. అఇయతే ఆస్ట్రేలియా ఇప్పటికే 45 ఓవర్లు పూర్తయ్యే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 271 పరుగులతో క్రీజులో ఉంది.