ఢిల్లీ: నిర్ణయాత్మకమైన చివరి వన్డేలో భారత్ ఓడిపోవడంతో సిరీస్ ఆస్ట్రేలియా వశమైంది. సరైన సమయంలో రాణించాల్సిన బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేయడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఢిల్లీలో జరిగిన ఐదో వన్డేలో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా(100) సెంచరీతో కదం తొక్కగా.. హ్యాండ్స్‌కోంబ్(52) ఫర్వాలేదనిపించాడు. ఒక దశలో వికెట్ నష్టానికి 175 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉన్న ఆసీస్ 350 పరుగులు పైగా చేస్తుందనుకున్నారు. కానీ వికెట్లు వరసగా పడటంతో స్కోరు మందగింది. ఒక దశలో స్కోరు 250 దాటుతుందా అనిపించింది. చివర్లో బౌలర్లు రాణించడంతో చెప్పుకోదగిన స్కోరు చేయగలిగింది. భువనేశ్వర్‌కు 3, షమీ, జడేజాలకు రెండు వికెట్లు దక్కాయి.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ లక్ష్యం చేరుకునే కనిపించినా స్కోరు 132 పరుగులకు చేరుకునే సరికి ఫలితం ఆసీస్ వైపు మారింది. భువనేశ్వర్, జాదవ్‌లు ఓ సమయంలో భారత్ గెలుపుపై ఆశలు చిగురించేలా చేశారు. కానీ వెంట వెంటనే అవుట్ కావడంతో భారత ఓటమి ఖరారైంది. 50 ఓవర్లలో 237 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. రోహిత్‌శర్మ(56), జాదవ్(44), భువనేశ్వర్(46) రాణించారు. లక్ష్యాన్ని చేధించలేక 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఐదు వన్డేల సిరీస్ 3-2 తేడాతో ఆసీస్ వశమైంది. మొదటి రెండు వన్డేలు ఓడిపోయినా మొక్కవోని ధైర్యంతో ఆసీస్ చివరి 3 వన్డేలను గెలుపొందడం విశేషం. సిరీస్ ఆసాంతర రాణించిన ఖవాజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment