‘కంగారు’ పుట్టించింది...వీడియో వైరల్‌ | Australian football match held up for 32 minutes as rampaging kangaroo repeatedly invades pitch | Sakshi
Sakshi News home page

‘కంగారు’ పుట్టించింది...వీడియో వైరల్‌

Published Tue, Jun 26 2018 11:34 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

Australian football match held up for 32 minutes as rampaging kangaroo repeatedly invades pitch - Sakshi

కాన్‌బెర్రా(ఆస్ట్రేలియా): ఒక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతున్న స్టేడియంలోకి కంగారు అనుకోని అతిథిలా వచ్చి దాదాపు అరగంట పాటు అంతరాయం కల్గించింది. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో ఆదివారం స్థానిక మహిళా జట్లు క్యాపిటల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌-బెల్కోనెన్‌ యునైటెడ్‌ల మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌ సగ భాగం ముగిసిన తర్వాత క్రీడాకారిణులంతా విరామం తీసుకునేందుకు వెళ్లారు.

ఆ సమయంలో మైదానంలోకి  వచ్చిన ఆరడుగుల కంగారూ దర్జాగా కూర్చొని ఉంది. అది వెళ్లిపోతుందేమోనని కొద్దిసేపు ఎదురు చూశారు. కానీ కంగారూ అలాగే కూర్చొని ఉండడంతో ఫుట్‌బాల్‌ను దానివైపు విసిరారు. దాంతో అది అక్కడినుంచి లేచి మైదానంలో పరుగులు ప్రారంభించిందే తప్ప బయటకు వెళ్లలేదు. ఈ క్రమంలోనే క్రీడాకారిణులు, అధికారులు కంగారును పరుగులు పెట్టించారు. ఇలా అరగంట పాటు చేసిన తర్వాత కంగారు ఎట్టకేలకు బయటకు వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement