
గ్వాంగ్జౌ: ఇకపై బ్యాడ్మింటన్ ఆటను బీచ్‌లలోనూ చూడొచ్చు. ఎక్కడైనా ఆడొచ్చు. అంటే ఇండోర్ కోర్టులకే పరిమితమైన బ్యాడ్మింటన్ పోటీలు త్వరలో బహిరంగ ప్రదేశాల్లోనూ జరుగుతాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అధికారికంగా కొత్త ఔట్‌డోర్ బ్యాడ్మింటన్ ఆట ‘ఎయిర్ బ్యాడ్మింటన్’ను లాంఛనంగా ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకించి ఎయిర్ షటిల్ కాక్‌లను తయారు చేయించింది. దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారమిక్కడ జరిగింది. ఈ సందర్భంగా బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు పౌల్ ఎరిక్ హోయెర్ మాట్లాడుతూ ‘బ్యాడ్మింటన్ ఆటకు ఇది మరుపురాని రోజు. ఎయిర్ బ్యాడ్మింటన్‌తో మన పరిమితులు, హద్దులు చెరిగిపోతాయి.
బ్యాడ్మింటన్ రాకెట్‌ను ప్రొఫెషనల్ ఆటగాళ్ల చేతిలోనే కాదు ఇకపై ఎవరి చేతుల్లోనైనా చూడొచ్చు. ఎక్కడైనా ఆడొచ్చు’ అని అన్నారు. ఈ ఎయిర్ బ్యాడ్మింటన్‌ను ప్రత్యేకించి వీళ్లే ఆడాలని లేదు. ఇక్కడే ఆడాలనే నియమం లేదు. వయస్సుతో సంబంధం లేకుండా ఎంచక్కా ఆడుకునేలా ఎయిర్ బ్యాడ్మింటన్ ఆట రూపొందింది. హార్డ్‌కోర్ట్, గ్రాస్‌కోర్ట్, పార్క్‌ల్లోని ఇసుకపై, గార్డెన్, వీధులు, ప్లేగ్రౌండ్స్, బీచ్‌లు అంతటా ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడొచ్చని బీడబ్ల్యూఎఫ్ అధికారికంగా వెల్లడించింది. బయటి వాతావరణానికి అనుగుణంగా ఎయిర్ బ్యాడ్మింటన్ ఆటను అభివృద్ధి చేసినట్లు ఎరిక్ హొయెర్ తెలిపారు. ప్రత్యేకమైన రాకెట్, షటిల్ కాక్‌లు బలమైన గాలుల్ని తట్టుకునేలా తయారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment