ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో సెమీస్ బెర్త్‌ను దక్కించుకోవాలంటే బెంగళూరు టాప్ గన్స్ నేడు (బుధవారం) చెన్నై స్మాషర్స్‌తో జరిగే మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి.
* గెలిచిన జట్టు సెమీస్‌కు
* ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్
బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో సెమీస్ బెర్త్‌ను దక్కించుకోవాలంటే బెంగళూరు టాప్ గన్స్ నేడు (బుధవారం) చెన్నై స్మాషర్స్‌తో జరిగే మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి. ప్రస్తుతం 8 పాయింట్లతో జాబితాలో చివరన ఉన్న బెంగళూరు నాకౌట్ దశకు చేరుకోవాలంటే ఇంకా ఐదు పాయింట్లు అవసరం. కాబట్టి చెన్నైతో అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధిస్తేనే టాప్ గన్స్ ఆశలు సజీవంగా నిలుస్తాయి. మరోవైపు చెన్నై కూడా 13 పాయింట్లతోనే ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టాప్‌గన్స్ గెలిస్తే.. చెన్నై నాకౌట్ ఆశలు గల్లంతవుతాయి. ఎందుకంటే లీగ్ దశలో బెంగళూరు చేతిలో ఓడటం చెన్నై అవకాశాలపై ప్రభావం చూపుతుంది.
కాబట్టి చెన్నై కూడా అన్ని ప్రణాళికలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇప్పటికే 13 పాయింట్లతో ఉన్న ముంబై రాకెట్స్... ఢిల్లీ ఏసర్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉన్నా ముంబై నాకౌట్‌కు చేరుకుంటుంది. అవధ్ వారియర్స్ (17), ఢిల్లీ ఏసర్స్ (15) ఇప్పటికే సెమీస్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.
మ.గం 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం