ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 10 ఓవర్లలో 106 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. బెంగుళూరు ముందు 107 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
మెహాలీ: ఐపీఎల్-8లో భాగంగా నేడు (బుధవారం) కింగ్స్ XI పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం అంతరాయం తర్వాత ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్ని 10 ఓవర్లకి కుదించారు. ముందుగా టాస్ గెలిచిన బెంగళూర్ ఫిల్డీంగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 10 ఓవర్లలో 106 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. బెంగుళూరు ముందు 107 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ ఓపెనర్ గా వచ్చిన సాహా మొదట్లోనే 12 బంతుల్లోనే31 పరుగులు రాబట్టి ధాటిగా ఆడాడు. ఆ తర్వాత పరుగుల వేటలో పంజాబ్ వికెట్లు వరుసగా కోల్పోయింది... వోహ్రా(11), మిల్లర్(14), మ్యాక్స్ వెల్(10) బెయిలీ(13), మాన్ సింగ్(2)లు పరుగులు చేశారు. అక్సర్ పటేల్(20), రిషి ధావన్ (1)లు పరుగలు చేసి నాటౌట్ గా నిలిచారు.
బెంగళూరు బౌలర్లు హర్ష పటేల్,ఛాహ్లాలు తలో రెండు వికెట్లు తీయగా, స్టార్క్, వీయిసేలు తలో వికెట్ తీశారు.