కూతురికి క్రిస్ గేల్ ఆ పేరు ఎందుకు పెట్టాడు? | bataman Chris Gayle names his baby Blush | Sakshi
Sakshi News home page

కూతురికి క్రిస్ గేల్ ఆ పేరు ఎందుకు పెట్టాడు?

Published Thu, Apr 21 2016 6:21 PM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

కూతురికి క్రిస్ గేల్ ఆ పేరు ఎందుకు పెట్టాడు?

కూతురికి క్రిస్ గేల్ ఆ పేరు ఎందుకు పెట్టాడు?

వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్ గేల్ భార్య తాషా బెర్రిడ్జ్ ఓ పండంటి ఆడబిడ్డకు ఇటీవలే జన్మనిచ్చింది.   ఈ స్టార్ ఆటగాడు తన పాపను చూసేందుకు విండీస్ కు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో రెండు మ్యాచ్ లకు గేల్ అందుబాటులో ఉండటం లేదు. అయితే ఆ పాపకు గేల్ దంపతులు ఏ పేరును ఇష్టపడతారంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో గేల్ అభిమానులకు ఓ తాజా వార్త చెప్పాడు. తన చిన్నారికి 'బ్లష్' అని నామకరణం చేశాడు. ఈ వివరాలను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దేవుడు తనకు ఇచ్చిన ఎంతో విలువైన బహుమానం అంటూ తన పాప గురించి వ్యాఖ్యానించాడు.  ప్రతి ఒక్కరూ ఇలాంటి అనుభూతిని కోరుకుంటారని గేల్ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు. బార్ గర్ల్ తో వివాదం, మహిళా జర్నలిస్టుపై అసభ్యవ్యాఖ్యలు... దాంతో  కొన్ని నెలల నుంచి తనపై వస్తున్న ఆరోపణలపై గేల్ చాలా ఆగ్రహంగా ఉన్నట్లు అనిపిస్తుందని అక్కడి మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తన చిన్నారి ఏంజెల్ కు 'బ్లష్' (సిగ్గుపడటం, సిగ్గుతో ఉన్న బుగ్గలు) అంటూ పేరు పెట్టాడని కథనాలు వస్తున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement