గేల్కు పుత్రోత్సాహం | RCB's Gayle flies back home to meet newborn son, to miss Mumbai game | Sakshi
Sakshi News home page

గేల్కు పుత్రోత్సాహం

Published Tue, Apr 19 2016 8:25 PM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

గేల్కు పుత్రోత్సాహం

గేల్కు పుత్రోత్సాహం

ముంబై: వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ తండ్రిగా ప్రమోషన్ కొట్టేశాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్ కు పుత్రోత్సాహం కల్గింది.  ఆయన భార్య నతాషా బెర్రిడ్జ్ మగబిడ్డకు జన్మనిచ్చింది.  దీంతో ఈ స్టార్ ఆటగాడు విండీస్ కు పయనం అయినట్లు సహచర ఆటగాడు సర్పరాజ్ ఖాన్ స్పష్టం చేశాడు. ఆదివారం బెంగళూరులో మ్యాచ్ ముగిసిన అనంతరం గేల్ సరాసరి ఎయిర్ పోర్ట్ కు చేరుకుని ఖతార్ ఎయిర్ వేస్లో స్వదేశానికి బయల్దేరి వెళ్లినట్లు పేర్కొన్నాడు. దాంతో ముంబై ఇండియన్స్తో బుధవారం నాటి మ్యాచ్తో పాటు, ఆ తదుపరి మ్యాచ్ కు గేల్ అందుబాటులో ఉండటం లేదని సర్పరాజ్ తెలిపాడు.

ఇదిలా ఉండగా, ఐపీఎల్ ద్వారా తాను ఎంతో నేర్చుకుంటున్నట్లు సర్పరాజ్  ఈ సందర్భంగా స్పష్టం చేశాడు.  పలువురు ఆటగాళ్లతో కలిసి ఆడటం వల్ల అనేక విషయాల్ని నేర్చుకునే అవకాశం లభించిందన్నాడు.  ప్రత్యేకంగా షేన్ వాట్సన్ నుంచి అనేక విషయాలను నేర్చుకుంటున్నట్లు సర్పరాజ్ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement