ముంబై: భారత్‌లో జరిగే దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల స్పాన్సర్‌షిప్ హక్కులను స్టార్ ప్రైవేట్ లిమిటెడ్, ఈఎస్‌పీఎన్ సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ దక్కించుకుంది. ఒప్పందంలో భాగంగా ఈ గ్రూప్ ప్రతీ అంతర్జాతీయ మ్యాచ్‌కు రూ. 2 కోట్లు చెల్లించనుంది. గురువారం సమావేశమైన బీసీసీఐ మార్కెటింగ్ కమిటీ ఈ మేరకు స్పాన్సర్‌షిప్‌పై నిర్ణయం తీసుకుంది.
‘2013-14 సీజన్‌కుగాను భారత్‌లో జరిగే ప్రతి సిరీస్‌కు సంబంధించిన స్పాన్సర్‌షిప్ హక్కులను ఈఎస్‌పీఎన్ గ్రూప్‌కు కేటాయించాం. ఇందులో భాగంగా ప్రతి మ్యాచ్‌కు రెండు కోట్లు చెల్లిస్తారు’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. గతంలో ఎయిర్‌టెల్ మ్యాచ్‌కు రూ. 3.3 కోట్లు చెల్లించేది.
దీనితో పోలిస్తే ఈసారి ప్రతి మ్యాచ్‌కు రూ. 1.3 కోట్లు బోర్డుకు నష్టం వస్తున్నట్లే. అయితే స్పాన్సర్‌షిప్ కోసం కేవలం ఒక్క బిడ్ మాత్రమే రావడంతో బోర్డు రూ. 2కోట్లకు అంగీకరించక తప్పలేదు.
ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ఓ దశలో స్పాన్సర్లు వస్తారో లేదోననే సందేహం కలిగిందని, ప్రస్తుతం లభించిన మొత్తంతో బోర్డు సంతృప్తిగానే ఉందని పటేల్ తెలిపారు. మార్చి 2014 వరకు మొత్తం 13 మ్యాచ్‌లు భారత్‌లో జరగనున్నాయి. దీనికోసం రూ. 26 కోట్ల రూపాయలను ఈఎస్‌పీఎన్ గ్రూప్ చెల్లించనుంది. ఐపీఎల్ ఫిక్సింగ్ ఉదంతంతో రేటు తగ్గిందన్న వాదనను పటేల్ కొట్టిపారేశారు.
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2 కోట్లు
Published Fri, Oct 4 2013 1:55 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
Advertisement
Advertisement