దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరోసారి విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారు.
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరోసారి విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారు. మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం ఈ కుట్రను ఛేదించింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా (ఐఎస్ఐఎస్) సానుభూతిపరుడు, ముంబైకు చెందిన అనీస్ అన్నారీ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు.
ఓ స్కూలుతో సహా అమెరికా సంస్థలను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపాడు. అన్సారీని కోర్టులో హాజరు పరచగా, ఈ నెల 26 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించినట్టు ఏటీఎస్ అధికారి తెలిపారు. పోలీసులు అన్సారీ కంప్యూటర్లు, మొబైల్ ఫోన్, డాటాను స్వాధీనం చేసుకున్నారు. అన్సారీ అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు వ్యక్తులతో చాటింగ్ చేసినట్టు పోలీసులు చెప్పారు.