అబ్ది ఆరోపణ
న్యూఢిల్లీ: ఆర్‌సీఏ అధ్యక్షుడు లలిత్ మోడిపై ఎన్.శ్రీనివాసన్‌కు ఉన్న ద్వేషాన్ని సంతృప్తి పరిచే విధంగానే బీసీసీఐ నడుచుకుంటోందని అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మెహమూద్ అబ్ది ధ్వజమెత్తారు. జీవిత కాల నిషేధానికి గురైన మోడిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకే ఆర్‌సీఏను సస్పెండ్ చేశామని బీసీసీఐ ఇదివరకే పేర్కొన్న విషయం తెలిసిందే. ‘ఆర్‌సీఏపై నిషేధం చాలా హేయమైన చర్య. ఇది అనైతికం.
ఈ అంశంలో నీతి నియమాల గురించి బీసీసీఐ మాట్లాడుతున్న విధానం అహంకారపూరితంగా ఉంది. నిజానికి బోర్డు ఇంకా శ్రీనివాసన్ పాలనలోనే ఉంది. ఈ కారణంగానే ఆర్‌సీఏపై వేటు పడింది. ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్.. శ్రీని చేతిలో కీలుబొమ్మ లాంటి వారు’ అని అబ్ది విమర్శించారు.
శ్రీని కోసమే బోర్డు పనిచేస్తోంది
Published Fri, May 9 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM
Advertisement
Advertisement