అతడి కోసం డ్యాన్స్‌ చేస్తా: షారుఖ్‌ | Bollywood Hero Shahrukh Khan promises to perform live for Rohit Sharma in the IPL | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 13 2018 6:18 PM | Last Updated on Tue, Nov 13 2018 6:21 PM

Bollywood Hero Shahrukh Khan promises to perform live for Rohit Sharma in the IPL - Sakshi

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు కీర్తినార్జించి పెట్టిన చిత్రం ‘బాజీగర్’ 25 వసంతాలు పూర్తి చేసుకుంది.  ఈ చిత్రం విజయానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేశారని, దీనికి సంబంధించి షారూఖ్ తన తోటి నటీ నటులకు, దర్శకుడికి ధన్యవాదాలు తెలిపుతూ ట్వీట్‌ చేశారు. షార్‌ఖ్‌ ట్వీట్‌కు  ముంబై ఇండియన్స్‌ జట్టు సారథి రోహిత్‌ శర్మ రీట్వీట్‌ చేశారు. తనకు నచ్చిన చిత్రాలలో బాజీగర్‌ ఒకటని, అందులో ఎలాంటి సందేహం లేదని ట్వీట్‌లో స్పష్టం చేశారు.

అనూహ్యంగా రోహిత్‌ శర్మ నుంచి వచ్చిన స్పందనకు బాలీవుడ్‌ బాద్‌షా ఫిదా అయ్యారు. అంతేకాకుండా రోహిత్‌కు అదిరిపోయే గిప్ట్‌ ఇచ్చాడు. వచ్చే ఐపీఎల్‌ ప్రారంభోత్సవంలో రోహిత్‌ శర్మ కోసం బాజీగర్‌ చిత్రంలోని ‘ఏ కాలీ కాలీ ఆంఖే‌’ అనే పాటకు నృత్యం చేస్తానని ప్రకటించారు. ఐపీఎల్‌ పుణ్యమా అని బాలీవుడ్‌ స్టార్స్‌తో క్రికెటర్‌లకు మంచి సన్నిహిత్యం ఏర్పడింది. అందులోనూ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహయజమాని షారుఖ్‌ కావడంతో క్రికెటర్లతో స్నేహం కలిసింది. క్రికెట్‌ తరహాలోనే హాకీకి కూడా పెద్దఎత్తున మద్దతివ్వాలని గతంలో అభిమానులకు షారుఖ్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

బాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను తిరగరాసిన ఈ చిత్రంలో ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ కాజోల్, పొడుగాళ్ల సుందరి శిల్పాశెట్టిలు ప్రధాన పాత్రలు కాగా, షారూఖ్ ది మాత్రం నెగిటివ్ రోల్. ఆ పాత్రలో కూడా షారూఖ్ హీరోయిజాన్ని ప్రదర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement