
సరితకు ‘ఏషియాడ్’ పతకం అందజేత
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో తాను నెగ్గిన కాంస్య పతకాన్ని భారత మహిళా బాక్సర్ సరితా దేవి బుధవారం స్వీకరించింది.
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా ఈ పతకాన్ని ఆమెకు అందజేశారు.
కొరియా బాక్సర్‌తో జరిగిన వివాదాస్పద 60 కేజీల విభాగం సెమీఫైనల్లో ఓటమి తర్వాత... బహుమతి ప్రదానోత్సవంలో పతకాన్ని స్వీకరించేందుకు సరితా దేవి నిరాకరించింది. దీంతో ఆమెను ఏఐబీఏ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.