saritha devi
-
బాక్సర్ సరితాదేవి ‘నెగెటివ్’
న్యూఢిల్లీ: ప్రపంచ, ఆసియా మాజీ చాంపియన్, భారత మేటి బాక్సర్ లైష్రామ్ సరితా దేవి కోవిడ్–19 నుంచి బయట పడింది. తాజా పరీక్షలో తనకు నెగెటివ్ ఫలితం వచ్చినట్లు ఆమె వెల్లడించింది. అయితే ఏడేళ్ల తన కుమారుని ఆరోగ్య భద్రత దృష్ట్యా మరో 10 రోజుల పాటు ఇంటికి దూరంగా క్వారంటైన్లో ఉండనున్నట్లు పేర్కొంది. 38 ఏళ్ల సరితా దేవి, ఆమె భర్త తోయిబా సింగ్ ఆగస్టు 17న కరోనా పాజిటివ్‌గా తేలారు. చికిత్స అనంతరం సోమవారం కోవిడ్ సెంటర్ నుంచి డిశ్చార్జి అయినట్లు ఆమె తెలిపింది. ‘నాకు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా బయటపడ్డాయి. కాస్త జలుబు చేసింది అంతే. అయితే నెగెటివ్‌గా తేలడంతో ఆసుపత్రి నుంచి సోమవారమే బయటకొచ్చా. కానీ మరికొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉండాలనుకుంటున్నా. నేను ఇప్పుడు ఇంటికి వెళ్లి ఉంటే నా ఏడేళ్ల కుమారుడు వెంటనే వచ్చి నన్ను హత్తుకుని ఉండేవాడు. అతని ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయడం మాకిష్టం లేదు. అందుకే నా అకాడమీలోని హాస్టల్ గదిలో మరో పది రోజులు స్వీయ నిర్బంధాన్ని పాటిస్తా’ అని సరితా వివరించింది. ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత డింకో సింగ్ తర్వాత వైరస్ బారిన పడిన రెండో బాక్సర్ సరిత కావడం గమనార్హం. -
అదరగొట్టిన భారత బాక్సర్లు!
న్యూఢిల్లీ: పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. ఆదివారం జరిగిన ఐదు విభాగాల బౌట్లకుగాను నాలుగింటిలో భారత బాక్సర్లు విజయాలు సాధించారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ (48 కేజీలు), మనీషా మౌన్ (54 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు), కచారి భాగ్యవతి (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... 2006 చాంపియన్ లైష్రామ్ సరితా దేవి (60 కేజీలు) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. మరో బౌట్లో గెలిచి సెమీస్ చేరుకుంటే మేరీకోమ్, మనీషా, లవ్లీనా, భాగ్యవతిలకు కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. రికార్డుస్థాయిలో ఆరో స్వర్ణంపై గురి పెట్టిన భారత మేటి బాక్సర్ మేరీకోమ్ ఈ మెగా ఈవెంట్లో శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్ బరిలోకి దిగిన ఈ మణిపూర్ బాక్సర్ 5–0తో ఐజెరిమ్ కెసెనయేవా (కజకిస్తాన్)ను ఓడించింది. తొలి రౌండ్లో ఆచితూచి ఆడిన మేరీకోమ్ రెండో రౌండ్లో అవకాశం దొరికినపుడల్లా ప్రత్యర్థిపై పంచ్‌లు విసిరింది. బౌట్‌ను పర్యవేక్షించిన నలుగురు జడ్జిలు మేరీకోమ్‌కు అనుకూలంగా 30–27 పాయింట్లు ఇవ్వగా... మరోజడ్జి 29–28 పాయింట్లు ఇచ్చారు. ‘తొలి బౌట్ కఠినంగానే సాగింది. టోర్నీలో మొదటి బౌట్ కావడంతో ఒత్తిడితో పాల్గొన్నా. అయితే గత 16 ఏళ్లుగా నా అభిమానుల నుంచి ఈ రకమైన ఒత్తిడిని విజయవంతంగా అధిగమిస్తూ వస్తున్నా. ఈ తరహా ఒత్తిడంటే నాకు ఇష్టమే’ అని 35 ఏళ్ల మేరీకోమ్ వ్యాఖ్యానించింది. మంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనా బాక్సర్ వు యుతో మేరీకోమ్ తలపడుతుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారి పాల్గొంటున్న హరియాణాకు చెందిన 20 ఏళ్ల మనీషా మౌన్ మరో సంచలనం నమోదు చేసింది. 54 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ దీనా జాలమన్ (కజకిస్తాన్)తో జరిగిన బౌట్లో మనీషా 5–0తో గెలుపొందింది. ఈ ఏడాది దీనాపై మనీషాకిది వరుసగా రెండో విజయం కావడం విశేషం. పోలాండ్‌లో ఇటీవలే జరిగిన సిలెసియాన్ టోర్నీలోనూ మనీషా చేతిలో దీనా ఓడిపోయింది. ‘ఒకసారి రింగ్‌లో అడుగుపెడితే నా ప్రత్యర్థి ప్రపంచ చాంపియనా? రజత పతక విజేతా? లాంటి విషయాలు అస్సలు పట్టించుకోను. ( భాగ్యవతి ,లవ్లీనా,మనీషా,సరితా దేవి ) క్వార్టర్ ఫైనల్లో్లనూ దూకుడుగానే ఆడతా’ అని మనీషా వ్యాఖ్యానించింది. ఇతర బౌట్లలో లవ్లీనా 5–0తో 2014 ప్రపంచ చాంపియన్ అథెనా బైలాన్ (పనామా)పై... భాగ్యవతి 4–1తో నికొలెటా షోన్బర్గర్ (జర్మనీ)పై గెలుపొందారు. మరో బౌట్లో 2006 ప్రపంచ చాంపియన్ సరితా దేవి 2–3తో కెలీ హారింగ్టన్ (ఐర్లాండ్) చేతిలో ఓడిపోయింది. అయితే ఈ ఫలితంపై సరితా దేవి అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘మూడు రౌండ్లలోనూ ఆధిపత్యం చలాయించాను. కానీ జడ్జిల నిర్ణయంతో నిరాశ చెందాను. అయితే వారి నిర్ణయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. 2014 ఆసియా క్రీడల్లో చోటు చేసుకున్న వివాదం కారణంగా నాపై ఏడాదిపాటు నిషేధం విధించారు. జడ్జిలను విమర్శించి మరోసారి వివాదంలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా’ అని 36 ఏళ్ల సరితా దేవి వ్యాఖ్యానించింది. మంగళవారం క్వార్టర్ ఫైనల్స్‌లో స్టోకా పెట్రోవా (బల్గేరియా)తో మనీషా; స్కాట్ కయి ఫ్రాన్సెస్ (ఆస్ట్రేలియా)తో లవ్లీనా; పాలో జెస్సికా (కొలంబియా)తో భాగ్యవతి తలపడతారు. -
సరితపై ఏడాది నిషేధం
కోచ్ ఫెర్నాండెజ్‌పై రెండేళ్లు జీఎస్ సంధూకు మినహాయింపు ఏఐబీఏ నిర్ణయం న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పతకం స్వీకరించేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ లైష్రామ్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) ఏడాదిపాటు నిషేధం విధించింది. దాంతోపాటు వెయ్యి స్విస్ ఫ్రాంక్‌ల జరిమానా వేసింది. నిషేధం 2014 అక్టోబర్ 1 నుంచి 2015 అక్టోబర్ 1 వరకు అమల్లోకి ఉంటుంది. తీవ్రమైన చర్యలు తప్పవని మొదట్లో సంకేతాలు వచ్చినా... నిషేధం తక్కువగా ఉండటంతో సరితా దేవి బాక్సింగ్ కెరీర్‌కు పెద్ద ముప్పు తప్పింది. ప్రస్తుతం మణికట్టు గాయంతో బాధపడుతున్న ఆమె ఒలింపిక్స్ అర్హత టోర్నీ అయిన 2016 మహిళల వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అందుబాటులో ఉండనుంది. ‘ఏఐబీఏ నిర్ణయం నాకు ఊరటనిచ్చింది. కష్టకాలంలో నాకు అండగా నిలిచిన బాక్సింగ్ ఇండియా, కేంద్ర క్రీడల మంత్రికి, సచిన్ టెండూల్కర్‌కు, ఇతర అధికారులకు కృతజ్ఞతలు. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. కాబట్టి దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవడానికి మరింత కష్టపడతా’ అని సరిత పేర్కొంది. ఈ సంఘటనలో జాతీయ కోచ్ గురుబక్ష్ (జీఎస్) సింగ్ సంధూ, సాగర్ మైదయాల్ల తప్పులేదని ఏఐబీఏ క్రమశిక్షణ కమిటీ తేల్చింది. అయితే భారత్‌కు పని చేస్తున్న విదేశీ కోచ్ బ్లాస్ ఇగ్లేసియాస్ ఫెర్నాండెజ్‌ను మాత్రం కఠినంగా శిక్షించింది. ఆయనపై రెండేళ్ల నిషేధంతో పాటు 2 వేల స్విస్ ఫ్రాంక్‌ల జరిమానా విధించింది. 2014 అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. సరితా వ్యక్తిగత కోచ్ లెనిన్ మిటెటీపై ఏడాది, బౌట్ సందర్భంగా అనధికారికంగా రింగ్‌లో ఉన్నందుకు బాక్సర్ భర్త తొయిబా సింగ్‌పై రెండేళ్ల సస్పెన్షన్ విధించింది. సరితపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ తాజాగా ఏఐబీఏకు లేఖ రాస్తామన్నారు. -
సరితకు ‘ఏషియాడ్’ పతకం అందజేత
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో తాను నెగ్గిన కాంస్య పతకాన్ని భారత మహిళా బాక్సర్ సరితా దేవి బుధవారం స్వీకరించింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా ఈ పతకాన్ని ఆమెకు అందజేశారు. కొరియా బాక్సర్తో జరిగిన వివాదాస్పద 60 కేజీల విభాగం సెమీఫైనల్లో ఓటమి తర్వాత... బహుమతి ప్రదానోత్సవంలో పతకాన్ని స్వీకరించేందుకు సరితా దేవి నిరాకరించింది. దీంతో ఆమెను ఏఐబీఏ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. -
'సరితాదేవిపై నిషేధం తొలగించాలి'
న్యూఢిల్లీ: నిషేధానికి గురైన మహిళా బాక్సర్ సరితాదేవికి కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. సరితాదేవిపై నిషేధం తొలగించాలని కేంద్ర క్రీడల శాఖ కోరింది. ప్రపంచ బాక్సింగ్ సమాఖ్యకు ఈ మేరకు లేఖ రాసింది. ఆసియా క్రీడల్లో తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ సరితాదేవి పతకం తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో ఆమెపై క్రమశిక్షణ చర్యల కింద బాక్సింగ్ సమాఖ్య వేటు వేసింది. -
కాంస్యంతో సరిపెట్టుకున్న సరిత, రాణి
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత మహిళా బాక్సర్లు ఎల్. సరితా దేవి, పూజా రాణి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. 60 కేజీల విభాగంలో మంగళవారం జరిగిన సెమీస్ లో కొరియా బాక్సర్ జినా పార్క్ చేతిలో సరితా దేవి పరాజయం పాలయింది. మరో భారత మహిళా బాక్సర్ పూజా రాణి కూడా 75 కేజీల విభాగం సెమీస్‌లో లి కియాన్ (చైనా) చేతిలో పూజ ఓడిపోయింది. సెమీ ఫైనల్లో ఓటమి పాలవడంతో సరితా దేవి, పూజా రాణిలకు కాంస్య పతకాలు దక్కాయి.