
సరితా దేవి
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత మహిళా బాక్సర్లు ఎల్. సరితా దేవి, పూజా రాణి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. 60 కేజీల విభాగంలో మంగళవారం జరిగిన సెమీస్ లో కొరియా బాక్సర్ జినా పార్క్ చేతిలో సరితా దేవి పరాజయం పాలయింది.
మరో భారత మహిళా బాక్సర్ పూజా రాణి కూడా 75 కేజీల విభాగం సెమీస్‌లో లి కియాన్ (చైనా) చేతిలో పూజ ఓడిపోయింది. సెమీ ఫైనల్లో ఓటమి పాలవడంతో సరితా దేవి, పూజా రాణిలకు కాంస్య పతకాలు దక్కాయి.