
బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాలర్ కాకా ఆటకు బైబై చెప్పాడు. 2002 ‘ఫిఫా’ ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడైన కాకా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తాను ప్లేయర్‌గా మాత్రమే రిటైర్ అవుతున్నానని, పుట్‌బాల్ క్రీడకు దగ్గరగానే ఉంటానని స్పష్టం చేశాడు.
క్లబ్ మేనేజర్, స్పోర్టింగ్ డైరెక్టర్ వంటి పాత్రలు పోషించేందుకు సిద్ధంగా ఉంటానన్నాడు. 35 ఏళ్ల కాకా పూర్తి పేరు రికార్డో ఎల్జెక్సన్ డాస్ సాంతోస్ లిటీ. ఫుట్‌బాల్ వర్గాల్లో మాత్రం కాకా పేరుతో ప్రసిద్ధి. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు ఇచ్చే ప్రతిష్టాత్మక ‘బ్యాలన్ డి ఓర్’ పురస్కారాన్ని 2007లో అందుకున్నాడు. కెరీర్‌లో మిలాన్, రియల్ మాడ్రిడ్ క్లబ్‌లకు ఆడాడు. బ్రెజిల్ తరఫున 92 మ్యాచ్‌లు ఆడి 29 గోల్స్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment