మెకల్లోలం లేదు! | brendon mccullum out at 25 in last innings | Sakshi
Sakshi News home page

మెకల్లోలం లేదు!

Published Mon, Feb 22 2016 11:21 AM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

మెకల్లోలం లేదు!

మెకల్లోలం లేదు!

క్రైస్ట్‌చర్చ్: మొదటి ఇన్నింగ్స్ లో 'శత'కొట్టుడుతో రికార్డు సృష్టించిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ రెండో ఇన్నింగ్స్ లో స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బాదుతానని ప్రకటించిన కివీస్ కెప్టెన్ కు ఆస్ట్రేలియా బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. ఈ విధ్వంసకర ఆటగాడిని తక్కువ స్కోరుకే పెవిలియన్ కు పంపి ఊపిరి పీల్చుకున్నారు. మెక్ కల్లమ్ 27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ తో 25 పరుగులు చేసి అవుటయ్యాడు.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. లాంథమ్(39), గప్టిల్(0), నికోల్స్(2) అవుటయ్యారు. విలియమ్సన్(45), ఆండర్సన్(9) క్రీజ్ లో ఉన్నారు. పాటిన్సన్ 3 వికెట్లు తీశాడు. హాజిల్ వుడ్ కు ఒక వికెట్ దక్కింది. ఆసీస్ కంటే కివీస్ 14 పరుగులు వెనుకబడివుంది.

363/4 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 505 పరుగులకు ఆలౌటైంది. వోజెస్(60) అర్ధ సెంచరీ సాధించాడు. కివీస్ బౌలర్ వాగ్నర్ 6 వికెట్లు పడగొట్టాడు. బౌల్డ్ 2 వికెట్లు తీశాడు. ఆండర్సన్, విలియమ్సన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

మెక్ కల్లమ్ బౌలింగ్
అంతర్జాతీయ కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడుతున్న బ్రెండన్ మెకల్లమ్ కాసేపు బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు వేసి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. నాలుగు ఓవర్లలో రెండు మేడిన్ ఓవర్లు వేయడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement