
చివరి బౌట్‌లో ఫైట్ చేస్తున్న స్కాట్ వెస్ట్‌గార్త్
డాన్‌కాస్టర్: బ్రిటీష్ బాక్సర్ స్కాట్ వెస్ట్‌గార్త్ హెవీ వెయిట్ బాక్సింగ్ టైటిల్ గెలిచిన కొద్ది నిమిషాల్లోనే తుది శ్వాస విడవడం తీవ్ర విషాదాన్ని నింపింది. శనివారం జరిగిన ఇంగ్లిష్ టైటిల్ ఫైట్‌లో వెస్ట్‌గార్త్.. ప్రత్యర్థి డెక్ స్పెల్‌మన్‌పై విజయం సాధించిన తర్వాత సంబరాల్లో మునిగిపోయాడు.
అదే క్రమంలో పోస్ట్ మ్యాచ్ ఇంటర్య్వూ ఇవ్వడానికి వెళ్లిన వెస్ట్‌గార్త్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తొలుత కొద్దిపాటి గుండె నొప్పితో బాధపడిన వెస్ట్‌గార్త్ ఉన్నపళంగా నేలపై చతికిలబడిపోవడంతో కలకలం రేగింది. ముందుగా అక్కడున్న వైద్యులు అతనికి వైద్యం చేసి తర్వాత ఆస్పత్రికి తరలించారు. అయినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. వెస్ట్‌గార్త్ టైటిల్ గెలిచినా.. జీవితంలో ఓడిపోవడంతో బాక్సింగ్ ప్రపంచం షాక్‌కు గురైంది. అతను 10 ప్రొఫెషనల్ ఫైట్లలో తలపడిన వెస్ట్‌గార్త్ 7 విజయాల్ని సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment