ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ ఇన్‌స్టిట్యూషనల్ క్యారమ్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను అర్చన (ఆర్‌బీఐ) కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎం.ఎ.హకీమ్ (బీఎస్‌ఎన్‌ఎల్) చేజిక్కించుకున్నాడు. హైదరాబాద్ క్యారమ్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో ఏజీ ఆఫీస్ రిక్రియేషన్ క్లబ్‌లో ముగిసిన ఈ పోటీల్లో సోమవారం జరిగిన మహిళల వ్యక్తిగత సింగిల్స్ ఫైనల్లో అర్చన 24-13, 25-7 స్కోరుతో సుజని (21సెంటినరీ)పై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో అపరంజిత రాణి(ఎన్‌పీసీ) 19-13, 24-11తో నిరుప (ఏపీ ట్రాన్స్‌కో)పై గెలిచింది.
సెమీస్‌లో అర్చన 20-15, 25-17తో అపరంజితపై, సుజని 4-25, 24-10, 22-14తో నిరుపపై గెలిచింది. పురుషుల వ్యక్తిగత సింగిల్స్ ఫైనల్లో ఎం.ఎ.హకీమ్ 24-18, 20-25, 25-5తో వి.అనిల్ కుమార్ (ఏజీఓఆర్‌సీ)పై గెలిచాడు. మూడో స్థానం మ్యాచ్‌లో ఆర్.డి.దినేష్ బాబు (ఏజీఓఆర్‌సీ) 25-8, 25-8తో వి.ఎస్.కె.నాయుడు (ఆర్‌బీఐ)పై నెగ్గాడు. ఈ పోటీల విజేతలకు ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్ ఎన్.కృష్ణమోహన్ ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు బి.కె.హరనాథ్, ప్రధాన కార్యదర్శి ఎస్.మదన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
చాంప్స్ అర్చన, హకీమ్
Published Tue, Oct 1 2013 12:08 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement
Advertisement