సాక్షి, చెన్నై: రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఐపీఎల్‌లో చోటు దక్కడం ఇక్కడి క్రికెట్ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఇందులో ధోని, రైనా మళ్లీ చోటు దక్కించుకోవడంతో ఉత్సాహంతో అభిమానులు ఉరకలేస్తున్నారు. ధోని సారథ్యంలో మళ్లీ టైటిల్‌ను సూపర్‌కింగ్స్ దక్కించుకుంటుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
క్రికెట్ అభిమానులు ఇక్కడ మరీ ఎక్కువేనన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ రాకతో చెన్నై సూపర్ కింగ్స్ మీద అభిమానుల్లో ఎదురుచూపులు మరింతగా పెరిగాయి. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అంటే చాలు అన్నీ చోట్ల ప్రత్యక్ష ప్రసారాలే. రేడియోల్లో లైవ్ అప్‌డేట్స్ ఎక్కువే. ఇక్కడి అభిమానుల సందడి నడుమ చేపాక్ చిదంబరం స్టేడియం మునిగి పోతుంది. అందుకే రెండు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ కప్‌ను దక్కించుకుందని చెప్పవచ్చు. అయితే, రెండేళ్ల క్రితం ఐపీఎల్‌లో బయట పడ్డ మ్యాచ్ ఫిక్సింగ్ అభిమానుల్లో నిరాశనే మిగిల్చింది. చెన్నై సూపర్ కింగ్స్ మీద నిషేధం పడడంతో విచారం తప్పలేదు.
అభిమానుల్లో ఆనందమే
ఆ తదుపరి ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక్కడ జరిగినా, ఇతర జట్ల క్రీడ మీద తమిళ క్రీడాభిమానం పెద్దగా దృష్టి పెట్టలేదు. అయితే, రెండేళ్ల నిషేధానంతరం చెన్నై సూపర్ కింగ్స్‌కు రానున్న సీజ్‌న్‌లో మళ్లీ చోటు దక్కడం అభిమానుల్లో ఆనందమే. అందులోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోని, రైనా పునర్ ప్రవేశం చేయడం రెట్టింపు ఉత్సాహాన్ని అభిమానుల్లో నింపింది. ఈ ఇద్దరు ఎనిమిదేళ్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడారు. నిషేధం కారణంగా రెండేళ్లుగా ధోని పూణే జట్టులోను, రైనా గుజరాత్ జట్టులోను ఆడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఇద్దరు ఒకటిగా చేరి మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్‌లో అడుగు పెట్టనుండడం అభిమానులకు ఆనందమే.
అశ్విన్ లేదా జడేజా ఎంపిక..
అలాగే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మూడో వీరుడిగా అశ్విన్ లేదా జడేజా ఎంపిక కావచ్చని సమాచారం. ధోని సారథ్యంలో సాగే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లకు ఇక స్టేడియం నిండినట్టే. స్పాన్సర్లకు సైతం ఆనందమే. అదే సమయంలో చెన్నై అభిమానులు రెట్టింపు ఆనందంతో టైటిల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ కొడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది కాస్త ధోని సేన మీద అభిమానుల్లో అంచనాలకు దారి తీస్తున్నది.
Comments
Please login to add a commentAdd a comment