ధోనీ కెప్టెన్‌.. రైనా వైస్‌ కెప్టెన్‌..! | Raina set to be Dhoni's deputy in Chennai Super Kings | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 10 2018 8:16 PM | Last Updated on Wed, Jan 10 2018 8:16 PM

Raina set to be Dhoni's deputy in Chennai Super Kings - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో మళ్లీ మహేంద్ర సింగ్‌ ధోనీ, సురేష్‌ రైనా జోడీ మళ్లీ తమ మ్యాజిక్‌ను రిపీట్‌ చేయబోతోంది. స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో నిషేధం ఎదుర్కొన్న చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు ఈ ఏడాది నుంచి తిరిగి ఐపీఎల్‌ ఆడబోతున్న నేపథ్యంలో ఆ జట్టుకు కెప్టెన్‌గా ధోనీ తిరిగి ఎంపికైన సంగతి తెలిసిందే. ధోనీ కెప్టెన్సీలో చెన్నై జట్టు రెండుసార్లు టైటిల్‌ గెలుచుకుంది. నాలుగుసార్లు ఫైనల్‌కు వెళ్లింది. మళ్లీ ధోనీ సారథ్యంలో చెన్నై జట్టు ఏకీకృతం అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంపాటలో జట్టుకు సంబంధించిన పాత ప్లేయర్లను తిరిగి దక్కించేకునేందుకు చెన్నై జట్టు వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా సురేశ్‌ రైనా, రవీంద్ర జడ్డేజాలు మళ్లీ చెన్నై జట్టు తరఫున ఆడబోతున్నారు. అంతేకాదు ధోనీ చెన్నై జట్టుకు కెప్టెన్‌గా కాగా.. రైనా వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలను నిర్వహించబోతున్నాడు. ఈ విషయాన్ని రైనా మీడియాతో తెలిపాడు. వచ్చే వేలంపాటలో సత్తా ఉన్న నాణ్యమైన భారత, విదేశీ క్రికెటర్లను జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటినుంచే వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నామని రైనా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement