మళ్లీ వస్తా!
టెస్టు జట్టులో చోటుపై పుజారా
న్యూఢిల్లీ: టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్ర పడిన చతేశ్వర్ పుజారాకు భారత్ ఆడిన గత రెండు టెస్టుల్లోనూ తుది జట్టులో స్థానం లభించలేదు. అయితే గత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్నానని, ప్రదర్శన మెరుగు పర్చుకొని మళ్లీ జట్టులోకి రావడం పెద్ద కష్టమైన విషయం కాదని పుజారా ఆత్మవిశ్వాసంతో చెప్పాడు.
‘కొంత కాలంగా నేను జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాను. అయితే కొన్ని టెస్టులు ఆడే అవకాశం రాలేదు. దీనిపై ఎలాంటి బాధా లేదు. నేను మళ్లీ రావడం ఎంతో దూరంలో లేదు. నా ఆటను మరింత మెరుగు పర్చుకునే ప్రయత్నంలో ఉన్నా. చాలా మంది మాజీ ఆటగాళ్లు నాకు అండగా ఉన్నారు’ అని పుజారా వ్యాఖ్యానించాడు. ‘ఎ’ జట్ల మధ్య జరిగే ముక్కోణపు సిరీస్‌లో పుజారా భారత కెప్టెన్‌గా బరిలోకి దిగుతుండగా, తొలిసారి దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.
ద్రవిడ్‌తో కలిసి పని చేసేందుకు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు పుజారా చెప్పాడు. ‘ద్రవిడ్‌తో గతంలో చాలాసార్లు మాట్లాడాను. నా ఆట, టెక్నిక్‌లకు సంబంధించి అనేక సూచనలు ఇచ్చారు. అయితే ఈసారి నేరుగా కోచ్ హోదాలో ఆయన మాతో కలిసి పని చేస్తారు కాబట్టి అది ప్రత్యేకం’ అని పుజారా పేర్కొన్నాడు.