అరుదైన రికార్డుకు చేరువలో గేల్.. | Chris Gayle set to breach ten thousand run mark in T20 cricket | Sakshi
Sakshi News home page

అరుదైన రికార్డుకు చేరువలో గేల్..

Published Wed, Apr 5 2017 6:04 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

అరుదైన రికార్డుకు చేరువలో గేల్..

అరుదైన రికార్డుకు చేరువలో గేల్..

బెంగళూరు: వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ప్రపంచ ట్వంటీ 20 క్రికెట్ లో పది వేల పరుగులను చేరడానికి గేల్ అతి కొద్ది దూరంలో నిలిచాడు. మరో 63 పరుగులు చేస్తే పది వేల మైలురాయిని గేల్ అందుకుంటాడు. ఇప్పటివరకూ అన్ని రకాల ట్వీ 20 మ్యాచ్ ల్లో క్రిస్ గేల్ చేసిన పరుగులు 9,937.     

ఇప్పటిదాకా ప్రపంచ క్రికెట్లో ఏ బ్యాట్స్మన్ కు సాధ్యం కాని ఘనతను అందుకోవడానికి గేల్ కొద్ది దూరంలో ఉన్నాడు. ఐపీఎల్-10 సీజన్ ఆరంభంలో ఆర్సీబీ ఆడే మ్యాచ్ల్లోనే గేల్ ఈ ఘనతను అందుకునే అవకాశం ఉంది. బుధవారం సన్ రైజర్స్  హైదరాబాద్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆరంభపు మ్యాచ్ ను ఆడుతున్న క్రమంలో గేల్ కొత్త రికార్డుపై ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement