గేల్‌ను ఇంటర్వ్యూ చేసిన కోహ్లీ
గేల్‌ను ఇంటర్వ్యూ చేసిన కోహ్లీ
Published Wed, Apr 19 2017 5:27 PM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM
రాజ్‌కోట్: ఐపీఎల్ పదో సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. ఇప్పటిదాకా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. గేల్ దుమారం, కోహ్లీ మెరుపులతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 21 పరుగులు తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ 122 పరుగుల భాగస్వామ్యం అందించారు. దీంతో కోహ్లీ,గేల్ భాగస్వామ్యాల్లో 10 సెంచరీలు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లోనే గేల్ విరోచిత ఇన్నింగ్స్‌తో 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వీరద్దరి మెరుపు భాగస్వామ్యాలతో బెంగళూరు గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
మ్యాచ్ అనంతరం కోహ్లీ, గేల్‌ను సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. మైక్ అందుకున్న కోహ్లీ ‘నాతో ఓపెనింగ్ భాగస్వామ్యం పంచుకోవడం ఎలా ఉందన్నాడు. నువ్వు (కోహ్లీ) ఓ గొప్ప ఆటగాడివని,చాల పరుగులు చేసిన వీరుడివని, నీతో భాగస్వామ్యం పంచుకోవడం గొప్ప అనుభూతిగా ఉందని గేల్ బదులిచ్చాడు. నీవు కేరీర్‌లో మరిన్ని పరుగులు చేయాలని మనస్పూర్తిగా కొరుకుంటున్నాని వ్యాఖ్యానించాడు’. ఈ సమాధానంతో ఇద్దరి మధ్య నవ్వులు పూసాయి. 150 స్ట్రైక్ రేట్‌తో 16 సెంచరీలతో గేల్ 10 వేల పరుగులు చేయడం సంతోషంగా ఉందని కోహ్లీ తెలిపాడు. వెంటనే గేల్ 16 కాదు 18 సెంచరీలని కోహ్లీకి గుర్తు చేశాడు. టీ20ల్లో 10 వేల పరుగులు కొట్టిన తొలి బ్యాట్స్ మన్ గా నిలవడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన అభిమానుల, ఫ్రాంచైజీలకు ధన్యవాదాలు. మున్ముందు కూడా నా ఆటతో అభిమానులకు అలరించేందుకు ప్రయత్నిస్తాన’ని క్రిస్ గేల్ చెప్పాడు. తనదైన శైలిలోనే ఆడతానని, భవిషత్తులో మరిన్ని వేల పరుగులు సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు. కోహ్లీని ఉద్దేశించి మీరంతా నాకు ప్రత్యేకమని గేల్ అభిప్రాయపడ్డాడు.
Advertisement
Advertisement