సైనా ఎందుకు ఆడలేదు!
ప్రశ్నించిన కోచ్ ఆరిఫ్
సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ క్రీడలకు సైనా నెహ్వాల్ దూరంగా ఉండటాన్ని ప్రముఖ కోచ్, ‘ద్రోణాచార్య’ ఎస్.ఎం. ఆరిఫ్ తప్పు పట్టారు. ప్రభుత్వం అందజేస్తున్న సహకారంతో పెద్ద స్థాయికి ఎదిగిన సైనా, దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు ఎందుకు వెనుకాడిందని ఆయన ప్రశ్నించారు.
సైనా ఆడితే భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరేదని ఆరిఫ్ వ్యాఖ్యానించారు. ‘నాకు తెలిసి సైనా గాయం చాలా చిన్నది. కాలికి బొబ్బలు రావడం అనేది ఈ స్థాయి క్రీడల్లో చాలా సహజం. ఎంతైనా అది మూడు రోజుల్లో మానుతుంది. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు, శిక్షణతోనే ఆమె ఈ స్థాయికి చేరిందని మరచిపోవద్దు. ప్రైజ్‌మనీ టోర్నీల్లో కాకుండా కామన్వెల్త్‌లాంటి క్రీడల్లోనే మనం దేశం తరఫున ఆడాల్సి ఉంటుంది’ అని ఆరిఫ్ అన్నారు.