పాసులిస్తాం... రండి | Come we will give you the pases | Sakshi
Sakshi News home page

పాసులిస్తాం... రండి

Published Sun, Sep 6 2015 1:16 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM

Come we will give you the pases

డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో భారత జట్టుకు అభిమానుల నుంచి భారీ మద్దతు లభించేందుకు నిర్వాహకులు చక్కటి ప్లాన్ వేశారు. పటిష్ట చెక్ రిపబ్లిక్‌తో ఈ మ్యాచ్‌లు ఈనెల 18 నుంచి 20 వరకు జరుగుతుండగా వీటిని తిలకించేందుకు అభిమానులకు ఢిల్లీ లాన్ టెన్నిస్ సంఘం (డీఎల్‌టీఏ) 1500 ఉచిత పాస్‌లను ఇవ్వనుంది. వీటిని ఈనెల 9నుంచి డీఎల్‌టీఏ కార్యాలయంలో పొందవచ్చు. ఎవరు ముందు వస్తే వాళ్లకు పాస్‌లు ఇస్తామని, టెన్నిస్ అభిమానులు దీనిని వినియోగించుకోవాలని భారత టెన్నిస్ సమాఖ్య కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement