
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక డేవిస్ కప్‌లో పాల్గొనే భారత జట్టులో అనూహ్యంగా మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన జట్టు నుంచి యూకీ బాంబ్రీ, దివిజ్ శరణ్, సుమీత్ నాగల్ తప్పుకున్నారు. సెప్టెంబర్ 14 నుంచి క్రాలేవోలో సెర్బియాతో ఈ పోరు జరుగనుంది.
యూకీ బాంబ్రీ, దివిజ్ శరణ్‌లు గాయాల కారణంగా దూరం కాగా... సుమీత్ మాత్రం స్టాండ్‌బైగా జట్టుతో పాటు కొనసాగడం ఇష్టం లేక తప్పుకున్నాడు. దీంతో తెలుగు తేజం సాకేత్ మైనేనితో పాటు శ్రీరామ్ బాలాజీ వారీ స్థానాలను భర్తీ చేయ నున్నారు. అర్జున్ ఖడే స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు. 2014లో బెంగళూరులో సెర్బియాతోనే జరిగిన డేవిస్‌కప్ మ్యాచ్‌లో భారత్ 2–3తో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment