షూటింగ్లో భారత్ స్వర్ణ, రజత పతకాలు సాధించినా.. బ్యాడ్మింటన్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్లలో నిరాశ ఎదురైంది.
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో ఐదో రోజు సోమవారం భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. షూటింగ్లో భారత్ స్వర్ణ, రజత పతకాలు సాధించినా.. బ్యాడ్మింటన్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్లలో నిరాశ ఎదురైంది.
పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లు జీతూ రాయ్, గురుపాల్ సింగ్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి పసిడి, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. కాగా కాంస్య పతకం కోసం జరిగిన మిక్స్డ్ టీమ్స్ బ్యాడ్మింటన్ మ్యాచ్లో భారత్ 2-3తో సింగపూర్ చేతిలో ఓటమి చవిచూసింది. తెలుగుతేజాలు పారుపల్లి కశ్యప్, పీవీ సింధు విజయం సాధించినా.. ఇతర షట్లర్లు నిరాశపరిచారు. ఇక స్క్వాష్లో పురుషుల సింగిల్స్ కాంస్య పతకం పోరులో భారత ఆటగాడు ఘోషల్ 1-3తో బార్కర్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయాడు. టేబుల్ టెన్నిస్లోనూ పురుషుల టీమ్ కాంస్య పతకం పోరులో భారత్ ఓటమి చవిచూసింది.