
కాన్‌బెర్రా (మనుకా ఓవల్)
క్రికెట్ స్టేడియం ఉన్న మనుకా ఓవల్ ప్రాంతం భిన్న సంస్కృతులకు నిలయం. క్రికెట్, ఏఎఫ్‌ఎల్‌కు ప్రీమియర్ సైట్‌గా ఈ మైదానం ఉపయోగపడుతుంది. స్టేడియం పరిసర ప్రాంతాల్లో వృక్షాలు, చిన్న పార్క్‌లు ఉండటంతో వాతావరణం ఎప్పుడూ ఆహ్లాదభరితంగా ఉంటుంది. దీంతో మ్యాచ్‌ను చూసేందుకు వచ్చే సందర్శకులకు కనువిందు కలుగుతుంది.
1962లో బ్రాడ్‌మన్ పేరుతో పెవిలియన్ ఏర్పాటు చేయడంతో పాటు 87, 92లలో కొత్తగా స్టాండ్స్‌ను నిర్మిం చారు. మనుకా ఓవల్ బ్రాడర్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఈ స్టేడియాన్ని క్రమంగా అభివృద్ధి చేస్తున్నారు. 2013లో ఫ్లడ్‌లైట్స్‌ను బిగించారు. సిటీ సెంటర్, పార్లమెంట్, విమానాశ్రయం నుంచి మైదానానికి 10 నిమిషాల ప్రయాణం. దీని కెపాసిటీ 13,550. ఆస్ట్రేలియాకు రాజధాని అయిన కాన్‌బెర్రా పాత సంస్కృతికి ఆధునికతకు ప్రతీక. ఈ నగరాన్ని కృత్రిమంగా నిర్మించిన ‘బర్లీ గ్రిఫిన్’ అనే సరస్సు చుట్టూ నిర్మించారు.