'నాకు బ్లాటర్ తో అఫైర్ లేదు' | Cristiano Ronaldo's Ex-Girlfriend Irina Shayk Slams Reports of Affair With Sepp Blatter | Sakshi
Sakshi News home page

'నాకు బ్లాటర్ తో అఫైర్ లేదు'

Published Sat, Jun 6 2015 8:08 PM | Last Updated on Fri, Jun 15 2018 4:33 PM

'నాకు బ్లాటర్ తో అఫైర్ లేదు' - Sakshi

'నాకు బ్లాటర్ తో అఫైర్ లేదు'

లండన్:ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ తో తాను అఫైర్ కొనసాగిస్తున్నట్లు వచ్చిన వార్తలను రష్యన్ మోడల్ ఇరినా షాయక్ ఖండించింది. ఆ నిరాధారమైన రూమర్లు తనను కలచి వేశాయని స్పష్టం చేసింది.  పోర్చుగీస్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో తో 2010 నుంచి ప్రేమాయణం నడిపిన ఇరినా.. దానికి గత సంవత్సరం బ్రేకప్ చెప్పింది.  ప్రస్తుతం హాలీవుడ్ స్టార్ బ్రాడ్ లీ కూపర్ తో రిలేషన్ సాగిస్తున్న ఇరియానా తాజాగా బ్లాటర్ కు దగ్గరయ్యిందని స్పెయిన్ కు చెందిన ఓ న్యూస్ పేపర్ పేర్కొంది. అయితే దీనిపై ఇరియానా తీవ్రంగా మండిపడింది. తనకు బ్లాటర్ తో అఫైర్ ను అంటగడుతూ ప్రచురించిన వార్తల వెనుక  ఉద్దేశమేమిటో అర్ధం కావడం లేదని విమర్శించింది. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది.

 

ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన జోసెఫ్ సెప్ బ్లాటర్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 1998లో తొలిసారి ఫిఫా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బ్లాటర్... 17 ఏళ్లుగా ఆ పదవిలో కొనసాగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement