చెన్నై: ఐపీఎల్ సీజన్‌లో భాగంగా స్థానిక చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే సీఎస్‌కే రెగ్యులర్ కెప్టెన్ ఎంఎస్ ధోని మ్యాచ్‌కు దూరమయ్యాడు. జ్వరం కారణంగా ధోనితో పాటు రవీంద్ర జడేజాలు మ్యాచ్‌కు అందుబాటులో లేరు. ధోని స్థానంలో సురేశ్ రైనా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇప్పటివరకూ చెన్నై పదకొండు మ్యాచ్‌లకుగాను ఎనిమిది మ్యాచ్‌లకు గెలిచి ప్లేఆఫ్‌కు చేరువ కాగా, ముంబై ఇండియన్స్ పది మ్యాచ్‌ల్లో ఆరింట విజయం సాధించింది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 37 పరుగులు తేడాతో విజయం సాధించింది. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై భావిస్తోంది. మరొకవైపు సొంత మైదానం కావడం చెన్నైకు కలిసొచ్చే అంశం.
ఇదిలా ఉంచితే, ఈ సీజన్‌లో సొంత గ్రౌండ్‌లో ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ చెన్నైదే విజయం. ఇప్పటివరకూ చెపాక్‌లో చెన్నై ఐదు మ్యాచ్‌లు ఆడగా అన్నింటా విజయ ఢంకా మోగించింది. దాంతో ‘సిక్సర్’పై గురి పెట్టింది సీఎస్‌కే. ఈ మ్యాచ్‌లో గెలిస్తే చెన్నై ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలుస్తుంది. గత మ్యాచ్‌లో విజయంతోనే దాదాపు ప్లేఆఫ్ బెర్తును దాదాపు ఖాయం చేసుకున్న సీఎస్‌కే.. తాజా మ్యాచ్‌లో కూడా గెలిస్తే అధికారికంగా ప్లేఆఫ్‌కు చేరుతుంది. మరొకవైపు ముంబై కూడా బలంగా ఉండటంతో సీఎస్‌కే తీవ్రంగా శ్రమించక తప్పదు.
ముంబై
రోహిత్ శర్మ(కెప్టెన్), డీకాక్, ఎవిన్ లూయిస్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, పొలార్డ్, కృనాల్ పాండ్యా, అంకుల్ రాయ్, రాహుల్ చాహర్, మలింగా, బుమ్రా
సీఎస్‌కే
సురేశ్ రైనా(కెప్టెన్), షేన్ వాట్సన్, మురళీ విజయ్, అంబటి రాయుడు, ధృవ్ షోరే, కేదార్ జాదవ్, డ్వేన్ బ్రేవో, సాంత్నార్, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్
Comments
Please login to add a commentAdd a comment