
హైదరాబాద్: ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ గాయం కారణంగా 11 ఏళ్ల తర్వాత ఓ ఐపీఎల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. తొడ కండరాలు పట్టేయడంతో బుధవారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. 2011నుంచి ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న రోహిత్ వరుసగా 133 మ్యాచ్‌ల తర్వాత మొదటిసారి బరిలోకి దిగలేదు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా పేరిట ఉన్న రికార్డు పదిలంగా ఉంది.
రైనా సీఎస్‌కే తరుపున వరసగా 134 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఓ జట్టు తరుపున వరసగా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రైనా రికార్డు సాధించాడు. అయితే ఈ రికార్డు సమీపంలోకి వచ్చిన రోహిత్ శర్మ 133వ మ్యాచ్ దగ్గరే ఆగిపోయాడు. దీంతో రైనా రికార్డు భద్రంగా ఉంది. ఇప్పట్లో ఏ ఆటగాడు కూడా రైనా రికార్డును అధిగమించే అవకాశం లేదు. ఇక ఐపీఎల్‌లో రోహిత్ మ్యాచ్‌కు దూరం కావడం ఇది రెండోసారి మాత్రమే. 2011నుంచి ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న రోహిత్ వరుసగా 133 మ్యాచ్‌ల తర్వాత మొదటిసారి బరిలోకి దిగలేదు. అంతకు ముందు దక్కన్ చార్జర్స్ తరఫున ఆడిన మూడేళ్లలో అతను ఒక మ్యాచ్ ఆడలేదు.
రిస్క్ చేయడం ఎందుకని
కీలక ప్రపంచకప్‌కు ముందు ప్రధాన బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మకు ‘ఐపీఎల్’ గాయం కావడం టీమిండియా శిబిరాన్ని కలవరపాటుకు గురిచేసింది. బీసీసీఐ కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే రోహిత్ గాయంపై ముంబై ఇండియన్స్ ఓప్రకటన విడుదల చేసింది. రోహిత్ గాయం తీవ్రమైందేమీ కాదని.. ప్రపంచకప్‌కు ముందు రిస్క్ చేయడం ఎందుకని ముందు జాగ్రత్తగా పంజాబ్ మ్యాచ్‌కు విశ్రాంతినిచ్చామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment