చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-12వ సీజన్‌లో ఇక అసలు సిసలు సమరం ప్రారంభమైంది. ముంబై ఇండియన్స్, చెన్నె సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించగా, తొలి రెండు స్థానాల్లో నిలిచిన ముంబై, సీఎస్‌కేల మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరుగనుంది. నేడు(మంగళవారం) చెపాక్ స్టేడియం వేదికగా సీఎస్‌కేతో జరుగునున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే ముందుగా బ్యాటింగ్ తీసుకుంది.
చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అభేద్యమైన రికార్డు ఉంది. ఎంతలా అంటే చివరి 20 మ్యాచ్‌ల్లో సీఎస్‌కే ఓడింది రెండు సార్లు మాత్రమే. అయితే ఈ రెండుసార్లు ఆ జట్టు ఓడింది ముంబై ఇండియన్స్‌చేతిలోనే. ఇప్పుడు మరోసారి తమ అడ్డాలో ముంబైతో కీలక పోరుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంచితే, 2008, 2010 సీజన్‌లో మాత్రమే సొంత వేదికలో ముంబైపై సీఎస్‌కే గెలవగలిగింది. తాజా సీజన్‌లో లీగ్‌లో ఇప్పటిదాకా ఆడిన 14 మ్యాచ్‌ల్లో ముంబై, చెన్నై తొమ్మిదేసి విజయాలతో ఉన్నాయి. లీగ్ దశలో రెండు సార్లు సీఎస్‌కేపై ముంబై ఇండియన్స్ గెలిచింది.
బ్యాటింగ్‌లో ఏమాత్రం నిలకడ కనిపించకపోవడం చెన్నై జట్టును ఆందోళనపరుస్తోంది. డుప్లెసిస్, వాట్సన్, రైనాలు ఒక మ్యాచ్ ఆడితే మరో మ్యాచ్‌లో విఫలమవుతున్నా రు. ముఖ్యంగా షేన్ వాట్సన్ ఫామ్ దయనీయంగా ఉంది. హైదరాబాద్‌పై చేసిన 96 పరుగులు మినహా అతడు జట్టుకు ఉపయోగపడింది శూన్యం. మిడిలార్డర్‌లో ధోనీ మినహా అంతా విఫలమే. అంబటి రాయుడి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కానీ ముంబైలాంటి అద్భుత బౌలింగ్ లైన్‌పను ఎదుర్కొని భారీ స్కోరు సాధించాలంటే మాత్రం చెన్నై బ్యాట్స్‌మెన్ పూర్తి స్థాయిలో ఆడాల్సిందే. ఇక బౌలింగ్ విభాగం జట్టుకు అండగా ఉంది. స్పిన్నర్ తాహిర్ 21 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక సీఎస్‌కే విజయాల్లో హర్భజన్, జడేజా, దీపక్ చాహర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
చెపాక్‌లోనూ తమకు మంచి రికార్డే ఉండడంతో ముంబై ఇండియన్స్ ఆత్మవిశ్వాసంతో పోరుకు సిద్ధమవుతోంది. ఓపెనర్లు రోహిత్, డికాక్ జట్టుకు మెరుపు ఆరంభాన్నిస్తుండగా సూర్యకుమార్, హార్దిక్ పాం డ్యా ఆ తర్వాత భారీ స్కోర్లకు కారణమవుతున్నా రు. వీరిని కట్టడి చేయడం చెన్నై బౌలర్లకు కష్టమే.. పొలార్డ్ ఒక్కసారి మాత్రమే తన స్థాయికి తగ్గట్టుగా ఆడాడు. బౌలింగ్‌లో పేసర్లు బుమ్రా, మలింగా, హార్దిక్‌లతో పాటు క్రునాల్, రాహుల్ చాహర్ స్పిన్నర్లుగా తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఇక ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరొక అవకాశం ఉంటుంది. మరి ఏ జట్టు ముందుగా ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంటుందో అనేది చూడాలి.
తుదిజట్లు:
సీఎస్‌కే: ఎంఎస్ ధోని(కెప్టెన్), షేన్ వాట్సన్, మురళీ విజయ్, డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, డ్వేన్ బ్రేవో, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహీర్
ముంబై: రోహిత్ శర్మ(కెప్టెన్), డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, పొలార్డ్, జయంత్ యాదవ్, రాహుల్ చాహర్, జస్ప్రిత్ బుమ్రా, లసిత్ మలింగ
Comments
Please login to add a commentAdd a comment