
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తనున్నాడు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన అతను ఈ నెల 13 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరీస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు.
‘దశాబ్ద కాలంగా టి20, వన్డేల్లో వార్నర్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్. ఇప్పుడు అతను మాతో కలవనున్నాడు’ అని ఈ సిరీస్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న చానెల్–9 డైరెక్టర్ టామ్ మలాన్ తెలిపారు. జూన్ 16న కార్డిఫ్‌లో జరిగే రెండో మ్యాచ్‌లో వార్నర్ కామెంటేటర్‌గా కనిపించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment