కోల్కతాకు స్వల్ప లక్ష్యం
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ 99 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన కోల్ కతా తొలుత ఢిల్లీని బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ ఆది నుంచి తడబడింది. జట్టులో ఏ ఒక్క ఆటగాడు కనీసం పోరాట పటిమను ప్రదర్శించడంలో విఫలమయ్యారు.
డీ కాక్(17), మయాంక్ అగర్వాల్(9), ఎస్ఎస్ ఐయ్యర్(0), కేకే నాయర్(3), సంజూ శ్యాంసన్(15), నేగీ(11), బ్రాత్ వైట్(6), క్రిస్ మోరిస్(11),అమిత్ మిశ్రా(3) , జహీర్ ఖాన్(4) ఇలా వరుసగా క్యూట్టడంతో ఢిల్లీ 17.4 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌటయ్యింది. కోల్కతా బౌలర్లలో రస్సెల్, బ్రాడ్ హాగ్లు తలో మూడు వికెట్లు సాధించగా, పీయూష్ చావ్లా, హేస్టింగ్లకు చెరో రెండు వికెట్లు దక్కాయి.