న్యూఢిల్లీ: డెల్‌రే బీచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో లియాండర్ పేస్ (భారత్)–యెన్ సున్ లూ (చైనీస్ తైపీ) జంట పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో పేస్–యెన్ సున్ లూ ద్వయం 2–6, 1–6తో మూడో సీడ్ ట్రీట్ హుయె (ఫిలిప్పీన్స్)–మాక్స్ మిర్నీ (బెలారస్) జోడీ చేతిలో ఓడిపోయింది. 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పేస్ జంట తమ సర్వీస్‌ను నాలుగు సార్లు కోల్పోయింది. క్వార్టర్స్‌లో బ్రయాన్ బ్రదర్స్‌పై ‘సూపర్ టైబ్రేక్’లో సంచలన విజయం సాధించిన పేస్–యెన్ సున్ లూ ద్వయం అదే జోరును సెమీఫైనల్లో కనబర్చలేకపోయింది.