ధోని ఫౌండేషన్‌కు రూ. 20 లక్షలు
న్యూఢిల్లీ : బ్రిటిష్ సైనికుల సంక్షేమార్థం నిధుల సేకరణ కోసం నిర్వహించిన చారిటీ మ్యాచ్‌లో వచ్చిన డబ్బులో రూ. 20 లక్షలను మహేంద్ర సింగ్ ధోని (ఎంఎస్‌డీ) చారిటబుల్ ఫౌండేషన్‌కు అందజేశారు. సరిహద్దు రేఖ వద్ద విధులు నిర్వహిస్తూ తీవ్రంగా గాయపడిన జవాన్ల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. గత గురువారం కియా ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కు ఎంఎస్‌డీ ఫౌండేషన్ కూడా భాగస్వామిగా వ్యవహరించింది.
రాబోయే కాలం లో ఇలాంటి మ్యాచ్‌లను భారత్‌లో కూడా ఏర్పాటు చేసేందుకు ఈ ఫౌండేషన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ‘క్రికెట్ ఫర్ హీరోస్’ జట్టు తరఫున బరి లోకి దిగిన ధోని అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ ద్వారా నిర్వాహకులు సుమారు 3 కోట్ల రూపాయలను సేకరించారు.