లండన్: వరల్డ్ కప్ టైటిల్ రేసులో తాము కూడా బలంగా ఉన్నామని టీమిండియా మరోసారి ఘనంగా చాటింది. ఆస్ట్రేలియాపై 36 పరుగుల విక్టరీతో వరల్డ్ కప్‌లో వరుసగా రెండో విజయం సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ భారీ సెంచరీ (109 బంతుల్లో 117), రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లి అర్ధ సెంచరీలు, చివర్లో హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోనీ మెరుపులు.. మొత్తానికి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆసీస్ ముందు 353 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
భారత్ భారీ స్కోరు అందించడంలో ధోనీ కూడా తన వంతు పాత్ర పోషించాడు. భారీ షాట్లతో అలరిస్తూ.. వేగంగా 27 పరుగులు చేశాడు. ముఖ్యంగా మిచేల్ స్టార్క్ వేసిన బంతిని ధోనీ అద్భుతంగా ఆడుతూ.. సిక్స్‌గా మలిచాడు. గంటకు 143 కిలోమీటర్ల వేగంగా స్టార్క్ వేసిన బంతిని డీప్ స్క్వేర్ లేగ్ దిశగా పవర్ హిట్టింగ్‌తో ధోనీ సిక్సర్‌గా మలిచాడు. ధోనీ బ్యాట్ ధాటికి బంతి అమాంతం గాల్లో లేచి.. అలా అలా ప్రేక్షకుల గ్యాలరీలో పడటంతో.. అది చూసి స్టన్ అయిన కోహ్లి (నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నాడు).. ఒక్కసారిగా నవ్వుల్లో మునిగితేలాడు. ధోనీ సిక్స్ మ్యాచ్‌లో హైలెట్లలో ఒకటిగా నిలిచింది. కోహ్లి కూడా ఈ మ్యాచ్‌లో సొగసైన షాట్లు ఆడాడు. 353 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో ఒక దశవరకు పోరాటపటిమ చూపిన ఆసీస్.. చివర్లో తడబడి నిర్ణీత 50 ఓవర్లకు 316 పరుగులకు ఆలౌట్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment