పాక్ బోర్డుకు మాజీ ఐసీసీ చీఫ్ సలహా
కరాచీ: ఈ ఏడాది డిసెంబర్‌లో పాకిస్తాన్‌తో సిరీస్ ఆడేందుకు భారత్ నిరాకరిస్తే ఇకపై ఆ జట్టుతో ఐసీసీ ఈవెంట్లలోనూ ఆడవద్దని ఐసీసీ మాజీ అధ్యక్షుడు ఎహ్‌సాన్ మణి సలహా ఇచ్చారు. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించేందుకు ఐసీసీ చొరవ చూపించాలని...లేదంటే ఈ తరహాలో వారికి కూడా సమాధానం ఇవ్వాలని ఆయన పాక్ బోర్డుకు సూచించారు. ‘ఏదైనా ఐసీసీ టోర్నీల్లో భారత్‌తో ఆడమంటూ తిరస్కరించే హక్కు పాకిస్తాన్‌కు ఉంది. ఈ టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్ నిర్వహిస్తే ఐసీసీకి మంచి ఆదాయమే వస్తోంది. భారత్ ఉన్న గ్రూప్‌లో తమను చేర్చవద్దంటూ పాక్ బోర్డు చెప్పేయాలి’ అని ఎహ్‌సాన్ వ్యాఖ్యానించారు.
భారత్‌తో ఆడవద్దు!
Published Tue, Oct 13 2015 1:17 AM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM
Advertisement