Ehsan Mani
-
పాక్ అభిమానులకు వీసాలు కావాలట..
న్యూఢిల్లీ: భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం వీసాల మంజూరు విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేసిన ప్రతిపాదనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వీసాల మంజూరు విషయంలో లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని ప్రతిపాదించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. క్రీడాకారుల వీసాలకు సంబంధించి ఎటువంటి అంక్షలూ ఉండవని భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. పాక్ అభిమానులకు, జర్నలిస్టులకు సైతం వీసాలు మంజూరు చేయాలని పీసీబీ చైర్మన్ ఎహసాన్ మణి కోరటాన్ని బీసీసీఐ తప్పుబట్టింది. వీసాల మంజూరు విషయంపై మార్చి నెలాఖరులోగా తమ నిర్ణయం చెప్పాలని షరతులు విధించడం పాక్ కండకావరంగా పేర్కొంది. తమ డిమాండ్లను తీర్చని పక్షంలో వేదికను యూఏఈకి మార్చాలని ఐసీసీకి లేఖ రాస్తామని బెదిరించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పీసీబీ చేసిన ప్రతిపాదనలు అపరిపక్వతతో కూడినవిగా కొట్టిపారేసింది. టోర్నీ నుంచి నిష్క్రమించే ఉద్ధేశంతోనే పీసీబీ ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటుందని ఆరోపించింది. భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న తరుణంలో పీసీబీ ఇలాంటి ప్రతిపాదనలు తెరపైకి తేవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇరు జట్ల మధ్య చివరి సారిగా 2007లో పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. 2012లో పాక్ జట్టు మూడు వన్డేలు, రెండు టీ20లు ఆడేందుకు భారత్‌లో పర్యటించింది. ఆ తరువాత దాయాదుల పోరు ఐసీసీ టోర్నీలకు ఆసియా కప్‌కు మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో పీసీబీ తాజా ప్రతిపాదనలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత జటిలంగా మార్చేశాయి. కాగా, ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మాసాల్లో భారత్ వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. -
‘సర్ఫరాజ్.. జట్టును ముందుండి నడిపించు’
ఇస్లామాబాద్ : భారత్ చేతిలో ఎదురైన ఓటమిని మరిచిపోయి ప్రపంచకప్ టోర్నీలోని మిగతా మ్యాచ్‌లపై దృష్టి సారించాలని పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) చైర్మన్ ఎహ్సాన్ మణి వెల్లడించినట్లు పాక్ మీడియా పేర్కొంది. ‘దేశమంతా మీకు అండగా ఉంది. రాబోయే రోజుల్లో కలసికట్టుగా మెరుగైన ప్రదర్శనను ఇస్తారని ఆశిస్తున్నాం’ అని సర్ఫరాజ్ అహ్మద్‌తో ఎహ్సాన్ మణి ఫోన్లో మాట్టాడినట్లు తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తకథనాలను పట్టించుకోకుండా రానున్న మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపించాలని చైర్మన్ ఎహ్సాన్ మణి సర్ఫరాజ్ అహ్మద్‌ను కోరినట్లు న్యూస్ ఎక్స్ తన కథనంలో వివరించింది. ‘మిగిలిన మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోతే తన సహచరులతో కలిసి స్వదేశానికి వెళ్తే ఇబ్బందులు తప్పవని’ ఆదివారం మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో భారత్‌తో ముగిసిన మ్యాచ్ అనంతరం సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లాడిన పాక్ 3 పాయింట్లతో పట్టికలో 9వ స్ధానంలో నిలిచింది. తమ తర్వాతి మ్యాచ్‌లో భాగంగా ఈ నెల 23న లార్డ్స్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. -
భారత్‌ను అడుక్కోలేం: పాకిస్తాన్
ఇస్లామాబాద్: ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో భారత్‌ను అడుక్కోలేమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నూతన అధ్యక్షుడు ఇషాన్ మణి స్పష్టం చేశారు. రెండు దేశాల ముందుకు వస్తేనే ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రజల అభిష్టం మేరకే భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ ఒప్పందాలు పునప్రారంభమవుతాయన్నారు. ‘తమ జట్టు ప్రతి ఒక్కరితో ఆడటానికి సిద్దంగా ఉంది. ముఖ్యంగా భారత్‌తో ఆడేందుకు ఉవ్విళ్లూరుంతోంది. మేం అక్కడికి వెళ్లినా.. వారు వచ్చినా ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. భారత అభిమానులు పాక్‌కు.. పాక్ అభిమానులు భారత్‌కు సంతోషంగా వెళ్లివస్తారు. ఇంతకు మించి ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగవ్వడానికి మరోదారి లేదు. భారత్, పాక్ ప్రజలు ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌ను చూడటానికి ఆసక్తి కనబరుస్తారు. కానీ రాజకీయ నాయకుల వల్లే సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ భవిష్యత్తులో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వారు కూడా ముందుకు వెళ్లలేరు. ఈ విషయంలో నాటకీయం చోటుచేసుకుంది. అదేంటో ఐసీసీ ఈవెంట్లలో భారత్ పాకిస్తాన్‌తో ఆడుతోంది, కానీ ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం ఆడదు. ఇదే మనం అర్థం చేసుకోవాలి. నేను ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం కృషి చేశాను. ఇప్పుడు ఈ విషయంలో జోక్యం చేదలుచుకోలేదు. భారత్‌కు ఆడాలని ఉంటే మాతో ఆడుతారు. లేకుంటే లేదు. అంతేగాని మేం వేళ్లి మాతో ఆడండని అడుక్కోలేం. భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగితే మంచిదే’ అని చెప్పుకొచ్చారు. భారత్-పాక్ మధ్య 2013 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడంలేదన్న విషయం తెలిసిందే. -
ఇండియాను ఏకిపారేయండి: మణి
కరాచీ: భారత్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య(ఐసీసీ) మాజీ అధ్యక్షుడు ఇహసాన్ మణి.. పాకిస్థాన్ క్రికెట్ సంఘం(పీసీబీ)కు సూచించారు. పాకిస్థాన్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ థాకూర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. ఐసీసీ సమావేశాల్లో భారత్ దుమ్ముదులపాలని అన్నారు. మంగళవారం రాత్రి పాకిస్థాన్ క్రికెట్ అధికారులతో ఆయన మాట్లాడారు. 'బీసీసీఐ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు అపరిపక్వంగా, రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఐసీసీ సమావేశాల్లో మనం మరింత సమర్థవంతంగా వ్యవహరించి ఇండియాను ఎదుర్కొవాల'ని ఆయన సూచించారు. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా చేసిన ప్రకటనలపై బీసీసీఐ అధ్యక్షుడిని ఐసీసీ వివరణ అడిగేలా ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లలో టీమిండియాతో ఆడొద్దని గత రెండేళ్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఇహసాన్ మణి సలహాయిస్తున్నారు. భారత్ ను సంతృప్తిపరిచే విధానాన్ని పాకిస్థాన్ క్రికెట్ అధికారులు అవలంభిస్తున్నారని, అందుకు టీమిండియాతో మ్యాచ్ లు రద్దు చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. -
భారత్‌తో ఆడవద్దు!
పాక్ బోర్డుకు మాజీ ఐసీసీ చీఫ్ సలహా కరాచీ: ఈ ఏడాది డిసెంబర్లో పాకిస్తాన్‌తో సిరీస్ ఆడేందుకు భారత్ నిరాకరిస్తే ఇకపై ఆ జట్టుతో ఐసీసీ ఈవెంట్లలోనూ ఆడవద్దని ఐసీసీ మాజీ అధ్యక్షుడు ఎహ్సాన్ మణి సలహా ఇచ్చారు. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించేందుకు ఐసీసీ చొరవ చూపించాలని...లేదంటే ఈ తరహాలో వారికి కూడా సమాధానం ఇవ్వాలని ఆయన పాక్ బోర్డుకు సూచించారు. ‘ఏదైనా ఐసీసీ టోర్నీల్లో భారత్‌తో ఆడమంటూ తిరస్కరించే హక్కు పాకిస్తాన్‌కు ఉంది. ఈ టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్ నిర్వహిస్తే ఐసీసీకి మంచి ఆదాయమే వస్తోంది. భారత్ ఉన్న గ్రూప్‌లో తమను చేర్చవద్దంటూ పాక్ బోర్డు చెప్పేయాలి’ అని ఎహ్సాన్ వ్యాఖ్యానించారు. -
'ఆ దేశాలే ఐసీసీని శాసిస్తున్నాయి'
లండన్:ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కల్గిన క్రికెట్ భవిష్యత్తుపై మాజీ ఐసీసీ అధ్యక్షుడు ఇహసాన్ మణి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత క్రికెట్ లో ఆరోగ్యకరమైన పరిస్థితులు సన్నగిల్లుతున్నాయని స్పష్టం చేశారు. ప్రపంచ గవర్నింగ్ సమాఖ్య తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా మణి ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే వరల్డ్ కప్(2019)నాటికి టెస్ట్ హోదా కల్గిన పది జట్లే ఉంటాయన్న ఐసీసీ నిర్ణయంపై మణి తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచంలో చాలా టీమ్ లో క్రికెట్ ఆడుతుంటే కేవలం 10 జట్లతోనే వరల్డ్ కప్ నిర్వహిస్తానడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు. గత క్రికెట్ కు, ఇప్పటి క్రికెట్ కు చాలా వ్యత్యాసాలు వచ్చాసాయన్నారు. క్రికెట్ అనేది వ్యాపార పరంగా మారుతోందన్నారు. ప్రధానంగా మూడు దేశాల అధీనంలోనే ప్రపంచ క్రికెట్ నడుస్తోందన్నారు. ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా ఈ మూడు జట్లు ఐసీసీని శాసిస్తున్నాయన్నారు. చాలా జట్లు ఆర్థికంగా తగిన బలంగా లేక చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయని మణి ఈ సందర్భంగా గుర్తు చేశారు.