
పారిస్: అయ్యో పాపం... గాట్లిన్! 100 మీటర్ల విభాగంలో ఇటీవలే ‘ట్రిపుల్ ఒలింపిక్ చాంపియన్’ ఉసేన్ బోల్ట్‌నే ఓడించి ప్రపంచ చాంపియన్ కూడా అయ్యాడు. కానీ గతం తాలుకు చేదు అనుభవం నీడలా వెంటాడుతోంది. గతంలో నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో రెండేళ్ల నిషేధానికి గురైన ఈ వివాదాస్పద అథ్లెట్‌ను అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్)‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు జాబితా నుంచి తప్పించింది.
2017 ఏడాదికి సంబంధించి రూపొందించిన ఈ తుది జాబితాలో 10 మంది చొప్పున పురుష అథ్లెట్లు, మహిళా అథ్లెట్లు ఉన్నారు. కానీ ఇందులో గాట్లిన్‌కు మాత్రం చోటు దక్కలేదు. 2004 తర్వాత తుది జాబితాలో అతను స్థానం కోల్పోవడం ఇదే తొలిసారి. ఐఏఏఎఫ్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. 2015 నుంచి మారిన నిబంధనల ప్రకారం శిక్ష అనుభవించిన డోపీలకు ఇందులో చోటు లేదని తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment